ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

Tue,September 11, 2018 12:33 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: ఎన్నికలకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్‌లోని సమావేశ మందిరంలో ఆధికారులతో సోమవారం సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధత కోసం అవలంభించే పద్ధతులు, తీసుకోవాల్సిన జా గ్రత్తలపై వివరించారు. జిల్లాలో గత ఎన్నికల్లో ఎన్ని క జరిగిన విధానం, పోలింగ్ బూత్‌ల వారీగా వివరాలడిగి తెలుసుకున్నారు. భద్రతకు కేటాయించా ల్సిన సిబ్బంది గురించి, జిల్లాలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలతో పాటు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ వివరించారు. జిల్లాలో క్లాసిఫికేషన్ అఫ్ పోలీస్ ఎక్సర్సైస్ పేరుతో ఎలెక్టోరల్ అఫెండర్లు, ఇతర రాష్ర్టాల నుంచి వివిధ మా ర్గాల ద్వారా జిల్లాలోకి వచ్చేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై నిఘా పెంచాలన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా నీఘా బృందాలు అప్రమత్తంగా ఉం డాలన్నారు. ఏఎస్పీ గోద్రు, డీఎస్పీ సాంబయ్య, సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ కాశయ్య, సీసీ కిరణ్ కుమార్, జిల్లాలోని ఎస్‌ఐలు, సీఐలు పాల్గొన్నారు.

ఎస్పీ సూచనలు
తమ పరిధిలోని ఓటర్ల సంఖ్యను పోలింగ్ స్టేషన్‌లపై, పోలింగ్ బూత్‌ల పట్ల పూర్తిగా అవగాహన పెంచుకునేందుకు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శించాలిసేష్టన్ పరిధిలోని కేడీ, దోషియార్ క్రిమినల్స్, రౌడీ షీటర్స్, కమ్యూనల్ అఫెండర్లను బైండోవర్ చేసి ఎటువంటి అవాంఛనీయ ఘనలు జరుగకుం డా చూడాలనీ, కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు.హింసకు అస్కారం కలిగించే ఎటువంటి చర్యలనైనా ఉపేక్షించకూడదు అని అటువంటి చర్యలను వెంటనే ఉన్నత ఆధికారుల దృష్టికు తీసుకురావాలని తెలిపారు.జిల్లాలో లైసెన్స్ ఆయుధాలు కలిగిన వారు తప్ప ని సరి విధిగా వారి ఆయుధాలు సంబంధిత పోలీస్ స్టేషన్ నందు అప్పగించవలెను అని పేర్కొన్నారు.బార్డర్ చెక్ పోస్టులపై కూడా దృష్టి సారించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆయన ఆదేశంచారు. ఆసత్యం, వదంతులు, నఖిలీ దస్తాలు సామాజిక మాధ్యమాల్లో పంపిన లేదా పెంపేలా పురిగొల్పిన వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని అవగాహన కల్పించేలా గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు.

121
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles