సమస్యాత్మక కేంద్రాలను గుర్తించండి


Tue,September 11, 2018 12:33 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లాలో సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని పోలీస్, రెవెన్యూ ఆధికారులకు ఎస్పీ మల్లరెడ్డితో కలసి సోమవారం సమీక్షించారు. క్రిటికల్, సెన్సిటీవ్, హైపర్ సెన్సిటీవ్ పొలింగ్ కేం ద్రాలను గుర్తించాలన్నారు. ఓటరు జాబితా సరవణ ప్రక్రియను సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 25 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటు నమోదు చేసుకునే వారి వయస్సు 2018, జనవరి 1 నాటికి 18 ఎండ్లు నిండి ఉండాలన్నారు. ఏ ఒక్క ఓటరు కూడా మిస్సవ్వకుండా చూడాలన్నారు. చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని సూచించారు.

పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
వీఆర్‌వో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారుల ను ఆదేశించారు. 16న వీఆర్‌వో పరీక్షలున్న నే పథ్యంలో పోలీస్ బందోబస్తు, 144 సెక్షన్ ఏర్పా టు చేయాలన్నారు. జీరాక్స్ సెంటర్లను మూసివేయాలనీ, రూట్ ఆఫీసర్లు ప్రశ్నా పత్రాలు, ఓ ఎంఆర్ షీట్స్ పోలీసుల సహకారంతో కేంద్రాలకు ఆదేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓలు కదం సురేశ్, రమేశ్ బాబు, డీఎస్పీ సత్యనారాయణ, సాంబయ్య, సీఐలు,రెవెన్యూ, పోలీస్ ఆధికారులు పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...