సమరానికి సై..


Mon,September 10, 2018 01:55 AM

-అటు అభ్యర్థుల ప్రచారం ఇటు అధికారుల సన్నద్ధం
-ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
-అందుబాటులోకి ఈవీఎంలు
-పల్లెల్లో వేడుక్కుతున్న రాజకీయం
-నోటిఫికేషన్ వచ్చే వరకూ ఓటర్ నమోదు ప్రక్రియ
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్-టి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో ఆసీఫాబాద్ నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు, సిర్పూర్-టి నియోజకర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. జిల్లాలోని ఆసీఫాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లోని 132313 మంది ఓటర్లు ఉండగా పురుషులు 65581 మంది, స్త్రీలు 66722 మంది ఇతరులు 10 మంది ఉన్నారు. అదేవిధంగా సిర్పూర్-టి నియోజకవర్గంలో 136604 మంది ఓటర్లు ఉండగా పురుషులు 69342 మంది, స్త్రీలు 67239 మంది, ఇతరులు 23 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు గతంలోనే జిల్లాలో 2864 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. బ్యాలెట్ బాక్సులు 4828 అవసరమున్నట్లు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో ఒక పోలింగ్ కేంద్రంలో 1400 మంది ఓటర్ల కంటే తక్కువ కాకుండా చర్యలు తీసుకుంటుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్ల కంటే ఎక్కువగా ఉండకుండా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

అధికార యంత్రాంగం సిద్ధం
ముందస్తు ఎన్నికలు వచ్చిన సిద్దంగా ఉండేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారవుతుండగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 18999 ఉండగా.. కుమ్రం భీం ఆసీఫాబాద్ ఏర్పడిన తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కనుక జిల్లాలో ఎన్ని ఈవీఎంలు అవసరమవుతాయనే అంచానాలు అధికారులు వేస్తున్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను బట్టి ఈ వీఎంలను తెప్పించటం, అవసరమైన వీఈవప్యాబ్‌లను ఏర్పాటు చేసుకోవటంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక్కో ఈవీఎంకు ఒక్కొ వవీప్యాబ్‌ను నినియోగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు అవసరమైన ఈవీఎంలతోపాటు అదనంగా ఈవీఎంలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

టీఆర్‌ఎస్ దూకుడు
జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా టీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగులకే మళ్లీ టిక్కెట్లు ఖరారు చేసింది. దీంతో రెండు రోజుల నుంచి అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. గురువారం రోజున టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయగా అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారాలను ప్రారంభించారు. టిక్కెట్లు పొంది నియోజవర్గాలకు చేరుకున్న పార్టీ అభ్యర్థులకు జిల్లాలోని టీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతాలు పలికారు. ఆసీఫాబాద్ నియోజకవర్గం నుంచి కోవ లక్ష్మీకి, సిర్పూర్-టి నియోజకవర్గం నుంచి కోనేరు కోనప్పకు పార్టీ అధిష్టానం టిక్కెట్లను కేటాయించటంతో టీఆర్‌ఎస్ పార్టీలో ఆనందం వెళ్లి విరుస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. నియోజకవర్గ కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నప్పటి నుంచి ఆయా సంఘాల నాయకులతో, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...