పోలీసులు ప్రజలతో మమేకం కావాలి


Mon,September 10, 2018 01:54 AM

-ఎస్పీ మల్లారెడ్డి
- పలు పోలీసుస్టేషన్ల తనిఖీ
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : ప్రజలతో పోలీసులు మమేకమై మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఎస్పీ మల్లారెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. రిసెప్షెన్ కౌంటర్‌లో నమోదైన ఫిర్యాదుల రిజిస్టర్‌ను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సీసీటీఎన్‌ఎస్ పని తీరు గురించి వివరాలు తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లను చెక్ చేసిన అనంతరం సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. సిబ్బంది పని తీరును అభినందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పని తీరు మెరుగు పరుచుకొని ప్రజల మన్ననలు పొందాలన్నారు. అనంతరం పోలీసు స్టేషన్ ప్రాంతాన్ని, పోలీసుల నివాస గృహాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, సీఐ మల్లయ్య ఉన్నారు.
కాగజ్‌నగర్ టౌన్ : ఎస్పీ మల్లారెడ్డి కాగజ్‌నగర్ పోలీస్టేషన్‌ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా టౌన్, రూరల్ పోలీస్టేషన్‌లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని, ఎక్కడైనా ఏదైనా అసాంఘిక చర్యలు జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. పండుగలను ప్రజలు శాంతి యుతంగా జరుపుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య, ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్, సీఐ ప్రసాద్‌రావు, ఎస్‌ఐలు ప్రభాకర్ రెడ్డి, మాజీద్, పోలీసులు ఉన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...