కోడి పందాల స్థావరాల పై టాస్క్‌ఫోర్స్ దాడులు

Mon,September 10, 2018 01:53 AM

కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ గ్రామంలోని కోడి పందెల స్థావరాలపై రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అకస్మిక దాడు లు చేసి ఏడుగురితో పాటు మూడు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. జనగామ గ్రామంలో కోడిపందెల స్థావరాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందగా టాస్క్‌ఫోర్స్ డీసీపీ(అడ్మిన్) అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ బుద్దే స్వామి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. కోడిపందెలు నిర్వహిస్తున్న అంగ పోష మల్లు, లెంకల మహేష్, నలగొండ స్వామి, గడ్డం రవి, కుర్మ శ్రీకాంత్, కోట రాజమల్లు, కొండగొర్ల అంకయ్య అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.4090, మూడు పందెం కోళ్లు, 2 కత్తులు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసు కున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించిన, మద్యం, గుట్కా అమ్మకాలు నిర్వహించిన చర్య లు తప్పవని టాస్క్‌ఫోర్స్ సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ సమ్మయ్య, కోటపల్లి ఏఎస్‌ఐ నజీర్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్, సిజాంపేట శేఖర్, వెంకటేశ్వర్లు, ఓంకార్, మహేందర్, సదానందం, శ్రీనివాస్, మల్లేష్ పాల్గోన్నారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles