గులాబీ జోష్


Sun,September 9, 2018 01:50 AM

-జిల్లాలో ప్రారంభమైన ఎన్నికల సందడి
-ప్రచారానికి తెరలేపిన టీఆర్‌ఎస్
-దరిదాపుల్లో లేని ప్రతిపక్షాలు
-జిల్లాకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యేలకు శ్రేణుల ఘనస్వాగతం
-మరోసారి ప్రజల ఆశీర్వాదం కోరుతూ ర్యాలీలు
-అభివృద్ధి పనులే ప్రచార అస్ర్తాలుగా ముందుకు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగా ణ: అసెంబ్లీ రద్దు అనంతరం మాజీ ఎమ్మెల్యేలు కోవ ల క్ష్మి, కోనేరు కోనప్ప జిల్లాకు చేరుకోవడంతో, గులాబీ శ్రేణుల్లో ఎన్నికల జోష్ మొదలైంది. జిల్లాలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు ప్రచారాలను ప్రా రంభించారు. టీఆర్‌ఎస్ అధిష్ఠానం సిట్టింగులకే టి క్కెట్లు కేటాయించడంతో కార్యకర్తల్లో రెట్టిపు ఉత్సా హం నెలకొంది. పార్టీ టికెట్లను పొంది నియోజకవర్గాలకు తిరిగి వస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

రెట్టింపు ఉత్సాహంతో టీఆర్‌ఎస్
సిట్టింగ్ అభ్యర్థులకే సీట్లు ప్రకటించడంతో, శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం వ్యక్తమవుతున్నది. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తుండగా, హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులకు అపూర్వ ఆహ్వానం లభించింది. మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారమే జిల్లా కేంద్రానికి చేరుకోగా, శనివారం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ద్వారా కాగజ్‌నగర్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు రైల్వేస్టేషన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రైల్వేస్టేషన్ నుంచి మొదలుకొని కాగజ్‌నగర్ పట్టణ వీదుల్లో బైక్‌ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంతోపాటు, కాగజ్‌నగర్ పట్టణాన్ని గులాబీ జెండాలతో అలంకరించారు. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్-టి నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో, గ్రామాల్లో కూడా ఎన్నికల సందడి నెలకొంది.

అభివృద్ధి కార్యక్రమాలే ప్రచారస్త్రంగా..
నాలుగేళ్లలో జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ ప్రచార అస్ర్తాలుగా మార్చుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యమ పార్టీగా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌కు బలమైన క్యాడర్ ఉండడంతో , సంక్షేమ కార్యక్రమాలను మ రోమారు ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. జిల్లాలో ఆసిఫాబాద్, సిర్పూర్-టి నియోజకవర్గా ల్లో నాలుగేళ్ల కాలంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించారు. ప్రతి గ్రామంతో పా టు ఇంటింటికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొం దిన వారు ఉంండడంతో, వాటిని బలంగా వినిపించాలని నాయకులు భావిస్తున్నారు.

పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి...
టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహిస్తుండడంతో జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్-టి నియోజకర్గాల్లో ఇందుకు భారీ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటించనుండగా, ఈలోపే తమ తమ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో పర్యటించి సభను భారీ స్థాయిలో విజయవంతం చేయాలని అభ్యర్థులు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో ఇప్పటికే ఎన్నికల జోష్ రావడంతో పార్టీ కార్యకర్తలు ఉత్సహంతో ఉన్నారు.
పత్తాలేని ప్రతిపక్షం..
అసెంబ్లీని రద్దుచేసిన సీఎం కేసీఆర్ ఏకంగా అభ్యర్థులను ప్రకటించడంతో టీఆర్‌ఎస్ పార్టీలో ప్రచారం ప్రారంభం కాగా.. ప్రతిపక్ష పార్టీల్లో ఎలాంటి సందడి కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఆశావాహనులు హైదరాబాద్ పయనమవుతున్నారు. డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో ప్రతిపక్ష పా ర్టీల్లో హైరానా మొదలైంది. ఎన్నికలకు చాలా తక్కు వ సమయం ఉండడంతో టిక్కెట్ల కోసం పైరవీలు మొదలు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లను ఆశీస్తున్న నాయకులు గాంధీభవన్ దారిపడుతున్నా రు. అధికార పార్టీ అభ్యర్థిని ప్రకటించి, ప్రచారానికి సిద్ధమవుతుండగా, ప్రతిపక్ష పార్టీ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు.

కేబీసీలో అమ్టె దంపతులకు రూ. 25 లక్షలు
గిరిజన సంక్షేమానికి ఖర్చు చేస్తాం: ప్రకాశ్ అమ్టే
చంద్రాపూర్(మహరాష్ట్ర): దేశంలో ప్రఖ్యాతి గాంచిన టీవీషోల్లో ఒకటైన సోని టెలివిజన్ కౌన్‌బనేగా కరోడ్‌పతి గేమ్‌షోలో గడ్చిరోలి జిల్లాలోని హె మల్‌కాసాకు చెందిన లోక్‌బిరదరి సంస్థ వ్వవస్థాపకులు ప్రకాశ్ అమ్టే దంపతులు శుక్రవారం రాత్రి రూ.25లక్షలు గెలుచుకున్నారు. అమ్టే దంపతుల షోలో ప్రతి పశ్న కు అమితాబచ్చన్‌కు సమాధా నం చ్చారు. 40 ఏళ్లుగా గడ్చిరోలి జిల్లాలో మడియా గొండుల అభివృద్ధితో పాటు జం తు సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న అమ్టే దంపతులను ప్రత్యేక ఆహ్వానితులుగా సీ జన్ 10లోని ఎపిసోడ్ 4షోకు పిలిచినట్లు షోలో అమితాబ్ ప్రేక్షకులకు తెలిపారు. గే మ్ షో అనంతరం అమ్టే దంపతులు మా ట్లాడుతూ షోలో గెలుపొందిన రూ.25లక్ష లు హెమల్‌కసాలో తాము స్థాపించిన లోక్‌బిరదరి సంస్థలోని విద్య, వైద్యం, జంతు సంరక్షణతో పాటు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. అమ్టే దంపతులు గెలుపొందడంతో లోక్‌బిరదరి ప్రకల్పాలో విద్యార్థు లు స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...