చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి


Sun,September 9, 2018 01:48 AM

- ఎస్‌ఐ బానోత్ వెంకన్న
-విద్యార్థులకు క్రీడా పరికరాలు పంపిణీ
కోటపల్లి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎస్‌ఐ బానోత్ వెంకన్న అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించాలనే ఉద్దేశంతో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు కోటపల్లి కస్తూర్బా గాంధీ, మోడల్ స్కూల్స్ విద్యార్థులకు శనివారం క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడారు. చిన్నతనం నుంచి ఆటలను భాగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలో క్రీడలకు గుర్తింపు ఉందని, ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కోటపల్లి పోలీసులు ఎప్పడు సిద్ధంగా ఉంటారని చెప్పారు. విద్యార్థులు, యువకుల్లో క్రీడాసక్తిని వెలికి తీసేందుకు మరిన్ని కార్యక్రమాలను చేపడతామన్నారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్య ఎదురైనా తమకు నిర్భయంగా చెప్పుకోవాలని సూచించారు. ప్రభు త్వ పాఠశాలలోని చిన్న చిన్న సమస్యలను తమ దృష్టికి తెస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హరిత, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమే శ్, ఉపాధ్యాయులు చంద్రరేఖ, మమత, రజిత పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...