అభినందల వెల్లువ


Sun,September 9, 2018 01:48 AM

-టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మికి మాతృశ్రీ యాజమాన్యం శుభాకాంక్షలు
ఆసిఫాబాద్ రూరల్: టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మరో సారి కోవలక్ష్మి అవకాశం లభించడంతో పలు సంఘాలు, ఆధికారుల నుంచి అభినందలు వెల్లువెత్తున్నాయి. మాతృశ్రీ కళాశాల సిబ్బంది, యాజమాన్యం తాజా మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి మిఠాయిలు తినిపించారు. కళాశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ మాతృ శ్రీ కళాశాలకు చైర్మన్‌గా ఉంటు తమకు ఎంతో అండగా నిలుస్తున్న కోవ లక్ష్మికి మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ లభించడం అనందగా ఉందన్నారు. కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారనీ, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...