ఫీజు కట్టలేదని..


Sat,September 8, 2018 01:00 AM

-విద్యార్థిపై చేయి చేసుకున్న పాఠశాల కరస్పాండెంట్
కౌటాల: ఫీజు కట్టలేదని విద్యార్థినిపై మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశా ల కరస్పాండెంట్ చేయి చేసుకున్న ఘటన వివాదస్పదమైంది. విద్యార్థి తండ్రి రాకేశ్ గోల్దార్ తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారుడు స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఫీజు చెల్లించలేదని పాఠశాల నుంచి బయటకు పంపించడంతో, డీఈవోకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం డీఈవో ఆదేశాల మేరకు పాఠశాలకు అనుమతించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన రూ. 10 వేలు కట్టినట్లు చెప్పారు. తిరిగి మళ్లీ తన కుమారుడిపై చేయి చేసుకొని గురువారం ఇంటికి పంపాడని ఆరోపించారు.

విషయం తెలుసుకున్న ఎంఈవో సోమయ్య పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. రిజిష్టర్‌ను పరిశీలించగా, అందులో విద్యార్థి పేరు కూడా నమోదు చే యలేదు. దీంతో ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి, యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...