ఘనస్వాగతం

Sat,September 8, 2018 01:00 AM

కుమ్రం భీం ఆసీఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఆసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఆపార్టీ కార్యకర్తల్లో సంబు రం నెలకొంది. అసెంబ్లీ రద్దు తరువాత శుక్రవా రం సా యంత్రం ఆసిఫాబాద్‌కు తిరిగి వచ్చిన కో వ లక్ష్మికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఘన స్వా గతం పలికారు. రెబ్బనలో కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. పటాకలు పేల్చి, ఘన స్వాగ తం పలికారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివా సం వద్ద ఉదయం నుంచే పెద్ద ఎత్తున సందడి నెలకొంది. పట్టణంలోని రహదారుల్లో గులాబీ జెం డాలతో అలంకరించారు. అంతకుముందు కోవ లక్ష్మి నివాసం నుంచి కుమ్రం భీం చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు.

మండలకేంద్రాల్లో ర్యాలీలు..
వాంకిడి/ కెరమెరి/ జైనూర్/ సిర్పూర్(యు)/ తిర్యాణి: టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవ లక్ష్మిని ప్రకటించడంతో మండల కేంద్రంలో భారీ ర్యాలీ తీశారు. టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు అజయ్‌కుమార్, బంబార ఎంపీ టీసీ వినోద్, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ పెంటు, జైరాం, అరుణ్, తదితరులున్నారు. కెరమెరి మండల నాయరేలే సంబురాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చుతూ, స్వీట్లు పంచారు. అనంతరం బైక్ ర్యాలీగా జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. నాయకులు షేక్ యూనుస్, ఉ త్తంనాయక్, ఇప్తేకర్ అహ్మద్, షేక్ దస్తాగిర్, రా జన్న, తదితరులున్నారు. జైనూర్ మండల కేం ద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ తీ శారు. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లా లా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమ్ర భగవంత్‌రావ్, వైస్ చైర్మన్ సెడ్మకి సీతారాం, మండల కోఆప్షన్ సభ్యుడు సుబుర్‌ఖాన్, టీఆర్‌ఎస్ నాయకులు గెడాం లక్ష్మణ్, హన్నుపటేల్, కినక యాదవ్‌రావ్, జాకీర్, లట్పటె మహదేవ్, జిలానీ, మూ సా తదితరులున్నారు. సిర్పూర్(యు)లో రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు ఆత్రం భగవంత్‌రావ్, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తొడసం ధర్మారావ్ ఆధ్వర్యంలో పటాకలు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఆత్రం ఓంప్రకాశ్, తదితరులున్నారు. తిర్యాణిలో మం డల కేంద్రం నుంచి ఐబీ తాండూర్ వరకు బైక్ ర్యాలీ తీశారు. ఎంపీపీ హనుమాండ్ల లక్ష్మి, ము త్యం రాజయ్య, హనుమాండ్ల జగదీష్, హనుమాండ్ల శం కరయ్య, తాళ్ల శ్రీనివాస్‌గౌడ్, బొమ్మగోని శంక ర్‌గౌడ్, చుంచు శ్రీనివాస్, ఉన్నారు.

119
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles