గులాబీ జెండా ఎగరేస్తాం


Sat,September 8, 2018 12:59 AM

-ఎమ్మెల్సీ పురాణం సతీశ్
రెబ్బెన: ఆసిఫాబాద్‌లో మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ అన్నారు. అసెంబ్లీ రద్దు, టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం హైదరాబాద్ నుంచి నియోజకవర్గానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి శుక్రవారం రాత్రి రెబ్బెన టీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దారి పొడుగున బైక్‌ర్యాలీలు నిర్వహించి, ప టాకలు పేలుస్తూ, మిఠాయిలు పంపిణీ చేస్తూ, నృత్యాలు చేస్తూ కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఓపెన్ టాప్ జీపు పై నిల్చొ ని, రెబ్బెన గ్రామస్తులకు అభివాదం చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల అశీర్వాదం తో మరోసారి పార్టీని గెలిపించుకుంటామన్నారు. నాలుగేళ్లలో పార్టీ చేసిన అభివృద్ధి పనులే గెలిపి స్తాయన్నారు. టీఆర్‌ఎస్ శ్రేణులు కోవ లక్ష్మి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. రెబ్బెన ఎం పీపీ కార్నాథం సంజీవ్‌కుమార్, జడ్పీటీసీ అజ్మీర బాబురావు, ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్‌కుమార్‌జైస్వాల్, జిల్లా ప్రధానకార్యదర్శి చెన్న సోమశేఖర్, తదితరులున్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...