ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తాం

Thu,September 6, 2018 11:57 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి/ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్య వస్థను మరింత బలోపేతం చేస్తామని ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేం ద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీ కరించిన ఆయన, విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాటల్లో.. 24 గంటల పా టు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలంది స్తాం. భద్రతాపరంగా ఎప్పుడు ఎలాంటి సమ స్య వచ్చినా నేరుగా పోలీస్టేషన్‌కు వచ్చి చెప్పుకునే వాతావరణాన్ని కల్పిస్తా. ప్రజలు పోలీసులతో స్నేహభావంతో ఉండేలా చేస్తాం. పోలీసులపై నమ్మకాన్ని కలిగించేలా చర్యలు తీసుకుం టా. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో మూఢనమ్మకాలను తొలగించేందుకు పోలీసుల పరంగా ప్ర త్యేక కళాబృందాలతో ప్రదర్శనలు ఇప్పిస్తాం. షీ టీమ్‌లతో మహిళలకు భద్రత కల్పించి సాం ఘిక, ఆర్థిక నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.

గిరిజన జిల్లాలో పని చేయడం మంచి అవకాశం
జిల్లాలో గిరిజనులతో కలిసి పనిచేయడం మం చి అవకాశం. గతంలో మహబూబ్‌నగర్, న ల్గొండ జిల్లాలు, హైదరాబాద్‌లోనూ వివిధ హో దాల్లో పని చేశా. గిరిజనుల్లో భద్రతాపరంగా మంచి మార్పులు తీసుకువచ్చేలా కృషి చేస్తా..

యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాం..
జిల్లాలో ఎక్కువగా ఎస్టీ, ఎస్సీలు ఉన్నారు. నిరుద్యోగ యువతకోసం ఇప్పటికే పోలీసు శాఖ ప రంగా అనేక శిక్షణలు కొనసాగుతున్నాయి. వీటి ని రానున్న రోజుల్లో మరింత విస్తృతం చేసి ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. అంతేగాకుండా వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు శాఖ పరంగా వారికి అవసరమైన వనరులు, అవకాశాలు కల్పిస్తాం. శిక్షణలు, కోచింగ్ అందించి ఉపాధి, ఉద్యోగ రంగాల్లో స్ధిపరడేలా చర్యలు తీసుకుం టాం. స్కిల్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తాం.

గుట్కా, మట్కా, గుడుంబా నివారణకు చర్యలు..
జిల్లాలో గుట్కా, మట్కా, గుడుంబా నివారణకు కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఎక్క డ కూడా ఈ వ్యాపారాలు జరుగకుండా పకడ్బందీగా వ్యవహరిస్తాం.

డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణకు ప్రత్యేక తనిఖీలు..
రోడ్డు ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లే ప్రధాన కారణం. దీనిని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు నిరంతరం తనిఖీలు చేపడుతాం. ఇందుకోసం జిల్లాలోని ప్రతి పోలీస్టేషన్‌లో బ్రీత్‌ఎనలైజర్లను అందు బాటులోకి తీసుకొస్తాం. ప్రతి రోజు సాయంత్రం ప్రతి పోలీస్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతాం. మద్యం తాగి నడిపే వారిపై కేసులు నమోదు చేస్తాం. వారికి జైలు శిక్షలు కూడా పడే అవకాశాలు ఉంటాయి.

వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు..
వాట్సాప్‌లో అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. దీనిని నమ్మి కొంతమంది కి ఇబ్బందులు తలెత్తుతాయి. అదేవిధంగా ఆన్‌లైన్ మోసాలు కూడా జరుగుకుండా చూస్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.

గ్రీవెన్స్‌లో సమస్యల సత్వరం పరిష్కరిస్తాం..
వివిధ సందర్భాల్లో చట్టపరమైన ఇబ్బందులు కలిగిన వారు. ఎక్కడైన అన్యాయానికి గురైన వారు పోలీసు స్టేషన్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌లో తమ సమస్యలు నేరుగా చెప్పుకోవచ్చు. దీంతో వెంటనే పరిష్కరించేదుకు చర్యలు చేపడుతా.

శాంతి భద్రతలకు ప్రజలు సహకరించాలి..
జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకారం అందించాలి. ఎక్కడైనా.. ఏదైనా. అసాంఘిక చర్యలు జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. త్వరలో రానున్న గణేశ్ ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలి.

97
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles