గులాబీ శ్రేణుల సంబురాలు

Thu,September 6, 2018 11:56 PM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర అసెంబ్లీని గురువారం రద్దు చేస్తూనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన మొదటి విడతలో ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మికి అవకాశం లభించడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోవ లక్ష్మి నివాసం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు అంబేద్కర్‌చౌక్, వివేకానంద చౌక్, గాంధీ చౌక్‌లలో టీఆర్‌ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు కోవ సాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్, సింగల్‌విండో చైర్మన్ అలీబీన్‌అహ్మద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, టీఆర్‌ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు గాదెవేణి మల్లేశ్, హైమద్‌బిన్ అబ్ధుల్లా, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు మహమూద్, ఎంపీటీసీ లక్ష్మి, ఎకిరాల సుగుణాకర్, రవీందర్, నాయకులు అన్సార్, రమేశ్, చిలుకూరి రవికుమార్, సాజిద్, సాయి శ్రావణ్, శ్రీనివాస్, సురేశ్, చెన్నూరి అశోక్, జకీర్, జీవన్, బండి శ్రీనివాస్, ఖాసీం, శ్రీరాం వెంకన్న, సత్తన్న, నిసార్, ధర్మయ్య, అనుమల్ల శ్రీకాంత్, పిడుగు తిరుపతి, మేకార్తి కాశయ్య, చిన్న తదితరులున్నారు.

రెబ్బెన : కోవ లక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేయంతో మండలంలో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. పటాకులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఎంపీపీ కార్నాథం సంజీవ్‌కుమార్, జడ్పీటీసీ అజ్మీర బాబురావు, ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్‌కుమార్‌జైస్వాల్, ప్రధానకార్యదర్శి చెన్న సోమశేఖర్, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మస్కు రమేశ్ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోవ లక్ష్మికి కేటాయించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గులాబీజెండాను ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మోడెం సుదర్శన్‌గౌడ్, గజ్జల సత్యనారాయణ, అశోక్, దుర్గం శ్రీను, వెంకటేశ్వరగౌడ్, రాజాగౌడ్, హన్మంతు, చోటు, అజయ్‌జైస్వాల్, మోడెం చిరంజీవి, వినోద్‌జైస్వాల్, బొమ్మినేని శ్రీధర్, భరద్వాజ్, పర్వతి అశోక్, రాజ్‌కుమార్, భానుప్రసాద్, రవీందర్, సత్యనారాయణ, విష్ణు, ఉబేదుల్లా, మన్సూర్, తిరుపతి, జహీర్‌బాబా, రాజేశ్వరి పాల్గొన్నారు.

జైనూర్ : కోవ లక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేయడంతో మండలంలో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. గురువారం మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయ సమీపంలో ప్రధాన రోడ్డుపై టీఆర్‌ఎస్ నాయకులు పటాకులు పేల్చి, మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుమ్ర భగవంత్‌రావు, వైస్ చైర్మన్ సెడ్మాకి సీతారాం, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్‌లాలా, కమిటీ డైరెక్టర్ గెడా లక్ష్మణ్, కినక యాదవ్‌రావ్, మాజి సర్పంచులు మెస్రం లక్ష్మణ్, మడావి భీంరావ్, నాయకులు జాకీర్, మూసా, లట్పటె మహాదవ్, శంకర్ తదితరులున్నారు.

వాంకిడి : కోవ లక్ష్మికి టికెట్ ఖరారు కావడంతో గురువారం సాయంత్రం టీఆర్‌ఎస్ మండల నాయకులు సంబురాలు చేశారు. హైదరాబాద్ నాగపూర్ అంతర్రాష్ట్ర రహదారిపై పటాకులు కాల్చారు. టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు అజయ్‌కుమార్, నాయకులు పెంటు, జైరాం, మొండి, శంకర్, గులాబ్, తదితరులున్నారు.

116
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles