శుభ తరుణం

Thu,September 6, 2018 01:11 AM

-బీసీల సంక్షేమంపై సర్కారు శ్రద్ధ
-100 శాతం సబ్సిడీపై రుణాలు
-జిల్లావ్యాప్తంగా 2647 దరఖాస్తులు
-1592 మంది అర్హుల గుర్తింపు
-1055 దరఖాస్తులు పెండింగ్
-ఇప్పటికే 21 మందికి రూ. 10.50 లక్షలు పంపిణీ
-మిగతా వారికి త్వరలో అందించేందుకు చర్యలు

బీసీల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. ఈ మేరకు చిరువ్యాపారులకు 100 శాతం సబ్సిడీపై రుణాలు అందిస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లా వ్యాప్తంగా 2647 మంది దరఖాస్తులు చేసుకోగా, ఇందులో 1592 మందిని అర్హులుగా గుర్తించింది. ఇప్పటికే మొదటి విడతలో గత నెల 15న ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి,కోనేరు కోనప్ప చేతుల మీదుగా 21 మందికి రూ. 10.50 లక్షలు పంపిణీ చేయగా, మిగతా వారికి త్వరలో ఇచ్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నది.

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : బీసీల సంక్షేమ మే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు చిరువ్యాపారం చేసుకునేందుకు వీలుగా నిరుపేదలకు 100 శాతం సబ్సిడీపై రు ణాలు అందజేస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమశాఖ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించగా, జిల్లా నలుమూలల నుంచి 2647 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు అధికారులు గ్రామ స భల ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 100 శాతం సబ్సిడీపై రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. ఎక్కడ ఎలాం టి సమస్యలు లేకుండా పారదర్శంగా ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందిస్తుంది.

21 మందికి రూ. 10.50 లక్షలు అందజేత


బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఇప్పటికే 21 మందికి 100 శాతం సబ్సిడీపై రూ.10.5 లక్షలు పంపిణీ చేశారు. 2647 మంది దరఖాస్తులు చేసుకోగా, వాటిలో ఇప్పటి వరుకు 1592 మందిని అర్హులుగా గుర్తించారు. 1055 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. కేటగిరి-1లో 396 మందికి 248 మందిని ఎంపిక చేయగా, అందులో 21 మందికి గత నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మిగతా వారికి చెక్కులను త్వరలోనే అందించనున్నారు. ఇందుకోసం అధికారులు పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నారు.

బీసీలపై ప్రత్యేక శ్రద్ధ


అత్యధిక జనాభాకలిగిన బీసీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో సంక్షేమ శాఖలు అంతంత మాత్రంగానే రుణాలు మంజూరు చేస్తూ కాలం వెళ్లదీసేవి. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నది. ఎక్కడ ఎలాంటి సమస్యల్లేకుండా పారదర్శకంగా సబ్సిడీ రుణాలు అందిస్తున్నది. ఇప్పటికే యాదవులకు గొర్రెలు పంపిణీ చేయడంతో పాటు తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. సబ్సిడీ రుణాలు అందజేయడంతో పాటు బీసీ స్ట డీ సర్కిల్ ద్వారా నిపుణులైన విద్యావంతులతో ఉచితంగా కోచింగ్ ఇస్తూ నిరుద్యోగులకు తోడ్పాటును అందిస్తుంది. నిరుద్యోగులు,గ్రామీణ,పట్టణ ప్రాంతల్లోని కుల వృత్తుల వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి నైపుణ్యం పెంచుతున్నది.

అర్హులకు 100 శాతం సబ్సిడీ రుణాలు


ప్రభుత్వం బీసీ సంక్షేమశాఖ ద్వారా చిరువ్యాపారులకు,నిరుపేదలకు 100 శాతం సబ్సిడీపై రుణాలు అందించి వారికి అర్థిక చేయుతనిచ్చేందుకు మంచి పథకం ప్రవేశ పెట్టింది. జిల్లా వ్యాప్తంగా 2467 మంది ధరఖాస్తు చేసుకోగా కేటగిరీ -1లో 396 మంది ఎంపికయ్యారు, కేట గిరీ -2లో 700 మంది, కేటగిరి -3లో 496 మంది ఎంపిక చేశాం. ఇందులో కేటగిరి-1 కింద ఇప్పటి వరకు 396 మందికి 100శాతం సబ్సిడీపై ఒక్కొక్కరికీ రూ. 50 వేల చొప్పున అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 21 మందికి పంపిణీ చేశాం. ఇంతే కాకుండా 227 మంది లబ్ధిదారులకు మంజూరు చేశాం. 100శాతం సబ్సిడీ పొందిన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలి.
- రాజేశ్వర్,బీసీ సంక్షేమ శాఖ అధికారి

110
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles