ఆకట్టుకున్న మాక్ పార్లమెంట్

Wed,September 5, 2018 11:59 PM

సిర్పూర్(టి): గురుకులాల సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్ ఆకట్టుకున్నది. ఎస్‌ఐ రామారావుతో కలసి జిల్లా గురుకులాల సమన్వయకర్త ఎం శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెబ్బెన, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ , సిర్పూర్( టి) గురుకులా పాఠశాలల విద్యార్థులు స్పీకర్, ప్రధానమంత్రి, మంత్రులుగా ఎంపీలుగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రజా సమస్యలపై పోటి పడి సభను నిర్వహించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులకు సామాజిక విషయాలపై అవగాహన కల్గి ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ఉపయోగపడతాయన్నారు. మాక్ పార్లమెంట్‌లో ప్రథమ స్థానంలో సిర్పూర్(టి) బాలుర పాఠశాల నిలువగా, ద్వితీయ స్థానంలో సిర్పూర్(టి) బాలికల పాఠశాల విద్యార్థులు నిలిచారు. విజేతలకు నగదు పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా భూపల్లి తిరుపతి, కంది రమేశ్ వ్యవహరించారు. సిర్పూర్(టి), కాగజ్‌నగర్ గురుకుల బాలికల పాఠశాలల ప్రిన్సిపాళ్లు భాగ్యమ్మ, పీ సుధాకర్, ఉపాధ్యాయులు డీ నరేశ్, డీ హరిత, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

వినతుల వెల్లువ..
ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈజీఎస్, సెర్ఫ్, ఐకేపీ లో వీఏవోలుగా విధులు నిర్వహిస్తున్న సి బ్బం ది బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. వారు వేతనాల ను పెంచి, ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలనీ , పదో వేతన సంఘం ప్రకారం పే స్కేల్ రివైజ్ చేయాలనీ , పీఎఫ్ సౌకర్యం కల్పించాలని వినతి పత్రాల్లో పేరొన్నా రు. ఇచ్చిన వారిలో ఈజీఎస్ సిబ్బంది మల్ల య్య, చంద్రశేఖర్, కిషన్, లక్ష్మణ్, గోవర్ధన్, తిరుపతి, అనిల్, వీఏవోలు శంకర్, తిరుపతి, రాజ్‌కుమార్, శ్రీనివాస్, జ్యోతి, సునీత, రాజేశ్, పద్మ , సెర్ఫ్ సిబ్బంది శంకరయ్య, రాజ్‌కుమార్, మహిపాల్, కిరణ్ కుమార్, శివకుమార్, సరోజ తదితరులు ఉన్నారు.

ఆలయాల నిర్మాణానికి భూమిపూజ
కౌటాల: మండలంలోని విర్దండి, గుండాయిపేట, హెట్టి, సదాశివపేట, కౌటాలలోని పోశమ్మ దేవాలయాల నిర్మాణాలకు బుధవారం ఎంపీపీ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనప్ప కృషితో ప్రతీ ఆలయం నిర్మాణానికి రూ. 10 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. అంతేగాకుండా విర్దండిలో రూ. 5 లక్షలలో 4 కల్వర్టుల నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సులోచన, ఆనందరావు, మాజీ సర్పంచులు మడావి రేణుక, పత్రు, లహన్సు, విజయ్, తిరుపతి, రవీందర్ గౌడ్, సత్తన్న, మల్లేశ్, బాపు, రాజన్న, మండల నాయకులున్నారు.

రైతు బీమా పత్రాల అందజేత
బెజ్జూర్ : మండలంలోని ముంజంపల్లిలో బుధవారం ఏఈఓ రవి తేజ రైతులకు బీమా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కారణాల వల్ల కొత్త పాసు పుస్తకాలు అందని వారికి త్వరలో అందనున్నాయనీ, ఏఈఓలను సంప్రదించి బీమా చే యించుకోవాలని సూచించారు. అదే విధంగా ఇంకా కొంత మంది బీమా చేసుకోలేదనీ, వారి పేర్లను జీపీల్లో అతికించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు డోకె వెంకన్న , గజం అశోక్, తొర్రెం భానయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ
కౌటాల : మండల కేంద్రానికి చెందిన క్రిష్ణ కవిరాజ్ రైతు అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ బసార్కర్ విశ్వనాథ్ బుధవారం బాధిత కు టుంబాన్ని పరామర్శించారు. రూ. 5 లక్షల బీమా డబ్బులు త్వరగా నామినీ ఖాతాలో జమయ్యేలా చూస్తామని హామీనిచ్చారు. ఎంపీపీ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ డుబ్బుల నానయ్య, ఎంఏఓ రాజేశ్, నాయకులు తిరుపతి, గట్టయ్య, రవీందర్ గౌడ్, డబ్బా బాపు, భరత్ కవిరాజ్ తదితరులున్నారు.

పారిశుధ్య పనులు
కాగజ్‌నగర్ టౌన్ : మండలంలోని చింతగూడలో బుధవారం గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. ఆయా వాడల్లో డ్రైనేజీలు, బావుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ సందర్భంగా కార్యదర్శి సంధ్య మాట్లాడుతూ పరిసరరాలను శుభ్రంగా ఉంచుకుంటే వ్యా ధులు రాకుండా నివారించవచ్చాన్నారు. కార్యక్రమంలో కారోబార్ మహేశ్, సిబ్బంది, పోచయ్య పాల్గొన్నారు.

136
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles