పేదింటి పెద్ద దిక్కు కేసీఆర్


Wed,September 5, 2018 11:59 PM

కౌటాల : పేదింటి పెద్ద దిక్కు సీఎం కేసీఆర్ అని ఎంపీపీ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇద్దరికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం ప్రవేశపెట్టారన్నారు. ఆడ బిడ్డ పెండ్లికి ఖర్చులకు రూ.లక్షా 116 అందజేసి ఆదుకుంటున్నారని తెలిపారు. పేదలు అప్పుల పాలు కాకుండా కాపాడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ బసార్కర్ విశ్వనాథ్, జడ్పీటీసీ డుబ్బుల నానయ్య, తహసీల్దార్ యాకన్న, ఎంపీడీవో రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు వెంకన్న, మండల ప్రత్యేక అధికారి మెహర్ బాషా, ఎంపీటీసీ పసునూరి స్వప్న, నాయకులు పసునూరి తిరుపతి, రవీందర్ గౌడ్, గట్టయ్య, ప్రభాకర్ గౌడ్, తదితరులున్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...