చదువుతో పాటు ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలి


Wed,September 5, 2018 11:59 PM

జైనూర్ : ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు చదువు చెప్పడంతోపాటు వారి ఆరోగ్యంపైనా దృష్టి సారించాలని జీసీడీవో శకుంతల అన్నారు. బుధవారం మండలంలోని రాసిమెట్ట గ్రామ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాఠించాలని సూచించారు. ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పార్వతి, సోనేరావ్ తదితరులున్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...