కంటి వెలుగు శిబిరం ప్రారంభం


Wed,September 5, 2018 01:04 AM

కౌటాల : అంధత్వాన్ని దూరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని ఎంపీపీ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం తలోడి గ్రామంలో శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు, మందులు, ఆపరేషన్లు చేస్తారన్నారు. 216 మందికి పరీక్షలు నిర్వహించగా, 89 మందికి అద్దాలు, 33 మందికి ఆపరేషన్ల కోసం రెఫర్ చేసినట్లు ఇన్‌చార్జి వైద్యాధికారి రామక్రిష్ణ తెలిపారు. పీహెచ్‌సీ వైద్యాధికారి కిష్ణప్రసాద్, కార్యక్రమ ఇన్‌చార్జి వైద్యాధికారి రామక్రిష్ణ, నాయకులు రవీందర్ గౌడ్, బిట్టుపల్లి సంతోష్, హెల్త్ సూపర్ వైజర్ పావని, కంటి పరీక్షల నిపుణురాలు తిరుపతమ్మ, డాటా ఆపరేటర్ మణిరాజ్, ఫార్మాసిస్ట్ జలాల్ పాషా, ఏఎన్‌ఎం రజిని, హెల్త్ అసిస్టెంట్ శైలేందర్, ఆశ వర్కర్లున్నారు.

ఐనం లో..
దహెగాం : ఐనం గ్రామంలో మంగళవారం 248 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఇన్‌చార్జి వైద్యుడు శ్రీకాంత్ తెలిపారు. ఇందులో 104 మందికి కళ్లద్దాలు అందజేశామనీ , మరో 16 మందికి ఆర్డరు చేయగా, 30 మందికి ఆపరేషన్ కోసం రెఫర్ చేసినట్లు పేర్కొన్నారు. శిబిరంలో ఫార్మాసిస్టు రాంచంద్రారెడ్డి, ఏఎన్‌ఎంలు హేమలత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...