కంటి వెలుగు పకడ్బందీగా నిర్వహించాలి

Wed,September 5, 2018 01:03 AM

-జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు
-కాగజ్‌నగర్, సిర్పూర్(టి)లో శిబిరాల సందర్శన
-వసతులపై ఆరా
కాగజ్‌గనగర్ రూరల్ : కంటి వెలుగును శిబిరాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు పేర్కొన్నారు. కాగజ్‌నగర్‌లోని ఎల్లగౌడ్‌తోటలో శిబిరాన్ని మంగళవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ కంటి పరీక్షలకు వచ్చే ప్రజల వివరాలను ఎప్పటికప్పు డు నమోదు చేయాలనీ, సందేహాలు ఉన్న వారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే నమోదు చేసి తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి అద్దాలు పంపిణీ చేసి, వారి వివరాలను ఆధార్‌కార్డు అనుసంధానంతో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఆపరేషన్ చేయించుకునే వారి వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేసి జిల్లా కేంద్రానికి సమాచారాన్ని అందించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. పీహెచ్‌సీలో 267 పరీక్ష చేసుకోగా, 139 మందికి అద్దాలు అందజేయగా, 60 మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. 39 మందిని ఆపరేషన్ కోసం రెఫర్ చేశారు. వైద్యురాలు విద్యావతి, శ్రీవాణి, సూపర్‌వైజర్ భారతి, అప్తాల్మిక్ దీపాలి, సురేశ్, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఉన్నారు.

సిర్పూర్(టి): మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలోని శిబిరాన్ని డీఎంహెచ్‌వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. వృద్ధులు, మహిళలతో మాట్లాడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. 211 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 12 మందికి అద్దా లు పంపిణీ చేయగా, 36 మందికి ఆర్డ ర్, ఏడుగురిని ఆపరేషన్‌కు రెఫర్ చేసిన ట్లు వైద్యులు తెలిపారు. కంటివెలుగు సి ర్పూర్(టి) ఇన్‌చార్జి డాక్టర్ నాగరాజు వైరాగడె, మెడికల్ ఆపీసర్ డాక్టర్ తిరుపతి, హెచ్‌ఈవో పున్నమయ్య, నర్సన్న, సిబ్బం ది, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

107
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles