కొనసాగుతున్న సప్లిమెంటరీ పరీక్షలు


Sun,May 20, 2018 03:04 AM

బెల్లంపల్లిటౌన్: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొ నసాగుతున్నాయి. శనివారం రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్ష జరిగింది. ప ట్టణంలోని మూడు పరీక్ష కేంద్రాల్లో 555 మంది విద్యార్థులకు 23 మంది గైర్హాజరయ్యారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 405 మంది విద్యార్థులకు 387 మంది, ద్వితీయ సంవత్సరంలో 150 మందికి 144 మంది పరీక్షలకు హాజరయ్యారు. ప్రథమ సంవత్సరం పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు, ద్వితీయ సంవత్సరం మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 167 మందికి ఆరుగురు, ద్వితీయ సంవత్సరంలో 60 మంది విద్యార్థులకు ఇద్ద రు, బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 125 మందికి నలుగురు, ద్వితీయ సంవత్సరంలో 44 మందికి ఇద్దరు, సాంఘిక సంక్షే మ బాలికల గురుకుల కళాశాలలోప్రథమ సంవత్సరంలో 113 మందికి ఏడుగురు, ద్వితీయ సంవత్సరంలో 46 మందికి ఇద్దరు గైర్హాజరయ్యారు. బాలుర జూనియర్ కళాశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా శంకర్‌నారాయణ్‌గౌడ్, డిపార్ట్‌మెంటల్ అధికారిగా బండి ప్రసాద్, బాలికల జూనియర్ కళాశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా కేదా స్ వెంకటేశ్వర్, డిపార్ట్‌మెంటల్ అధికారిగా వెంకటస్వామి, బాలికల గురుకుల కళాశాల చీఫ్ సూపరింటెండెంట్‌గా అరుణాభాయి, డిపార్ట్‌మెంట్ అధికారిగా సత్తమ్మలు విధులు నిర్వర్తించారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...