విద్యుదాఘాతంతో మహిళ మృతి

Sun,May 20, 2018 03:04 AM

తాండూర్: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ సంభవించి వివాహిత పి డుగు భాగ్య (33) మృతి చెందిన సం ఘటన శనివారం మండలంలోని అచ్చలాపూర్ గ్రామం లో చోటు చేసుకుంది. తాండూర్ ఎస్ ఐ కొత్తపల్లి రవి తెలిపిన వివరాల ప్రకా రం అచ్చలాపూర్ గ్రామానికి చెందిన భాగ్య, సత్తయ్య దంపతు లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయం భాగ్య తన ఇంటి ఆవరణలోని దం డెంపై ఆరవేసిన బ ట్టలను తీస్తుండగా ఒక్కసారిగా విద్యు త్ షాక్‌కు గురై అ క్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ సర్వీస్ కేబుల్ ఇంటి ముందు ఉన్న షెడ్డుకు తాకి ఉండడం, షెడ్డుకు ఆనుకుని దండెం ఏర్పాటు చేయడంతో వి ద్యుత్ ప్రసరించి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతురాలికి కూతురు పూజ (6) ఉంది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

120
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles