-దేశానికి దిక్సూచి కేసీఆర్

Sat,May 19, 2018 04:45 AM

-కాంగ్రెస్ అవినీతి అందరికీ తెలుసు
-ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
-పరకాల, దామెర మండలాల్లో పండుగలా చెక్కుల పంపిణీ
నమస్తే తెలంగాణ: దేవుడు ఇచ్చిన వరం రైతు బంధు పథకమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. పరకాల మండలంలోని నాలుగు గ్రామాల్లో, దామెర మండలం ల్యాదెళ్లలో చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. పరకాల మండలంలోని చర్లపల్లి గ్రామంలో జయహో కేసీఆర్ అంటూ గ్రామస్తులు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సంక్రాంతి ఉత్సవంలా నిర్వహించారు. గ్రామ శివారుల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఆర్డీవో మహేందర్‌జీతోపాటు టీఆర్‌ఎస్ నాయకులకు ప్రజాప్రతినిధులు, అధికారులకు ఘనస్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లు, మేళతాళాలు, కోలాట బృం దాలు, బోనాలు, బతుకమ్మలతో ఎదురెళ్లారు. ఈ సందర్భంగా ఊరు ఊరంతా ఊరేగింపు నిర్వహించారు. పండుగ వాతావరణంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు భీముడి నాగిరెడ్డి, సీనియర్ నాయకుడు నందికొండ జయపాల్‌రెడ్డితోపాటు టీఆర్‌ఎస్ గ్రామకమిటీ నాయకులు, బాధ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. చెక్కులు, పాస్‌బుక్కుల పంపిణీ, వాటి ప్రాధాన్యత, ప్రభుత్వ లక్ష్యం, అమలుచేస్తున్న పథకాలు, వాటి ఫలితాలు, గత ప్రభుత్వాల వైఫల్యాలను వివరించారు. కాగా చర్లపల్లి గ్రామస్తులెవరూ పనులకు వెళ్లకపో వడం గమనార్హం. కార్యక్రమంలో జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ బొల్లె భిక్షపతి, టీఆర్‌ఎస్ నాయకులు సాంబరెడ్డి, ప్రకాశ్‌రావు, రవికుమార్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ పావుశెట్టి వెంకటేశ్వర్లు, బొజ్జం రమేశ్, సర్పంచ్ సమ్మక్క, ఎంపీటీసీ అనసూర్య, ఉప సర్పంచ్ బుచ్చిరెడ్డి, మడికొండ సంపత్, ముస్కె రా ము, అశోక్, రాజిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

రైతన్నను ఆదుకునేందుకు పెట్టుబడి సాయం
దామెర: రైతుబంధు పథకంతో అన్నదాతలను ఆదుకు నేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. ల్యాదెళ్లలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించి, పట్టాదార్ పాసుపుస్తకాలు, చెక్కులను శుక్రవారం అందజేశారు. స్థానిక సర్పంచ్ మా దాసి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో రైతన్నను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ పంట పెట్టుబడికోసం ఎకరాకు రెండు పంటలకుగాను రూ.8వేలు ఇస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుని పాడిపంటలు పండుతాయని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో డబ్బులను ఏవిధంగా పెంచామో రైతుబం ధు పథకం డబ్బులను పెంచి రైతాంగానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షే మ పథకాలను చూసిన కాంగ్రెస్, బీజేపీలు సీఎం కేసీఆర్‌పై లేని పోని ఆరోపణలు చేస్తూ రాజకీయ దివాళాకోరుతనానికి దిగజారాయని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్ల పేరిట మోసాలకు పాల్పడిందని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ ప్రతీ ఒక్కరికీ వారి ఇంటివద్దే డబుల్ బెడ్‌రూం ఇండ్లను కట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. దేశాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఒక దిక్సూచిలా ఉన్నారని అన్నారు. సర్పంచ్‌లు మాదాసి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రమేశ్, రైతు సమితీ కన్వీనర్ మండల బిల్ల రమణారెడ్డి, గ్రామ కన్వీనర్ అమ్ముల రాజుయాదవ్, పీఏసీఎస్ చైర్మన్ భగవాన్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గండు రాము, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు జకీర్ అలీ, అనీల్, చిరంజీవి, బొంకూరి రవీందర్, ఆరె వెంకట్‌రెడ్డి, శేఖర్, కుమార్, కుమారస్వా మి, సతీష్, సాంబయ్య, దేవేందర్, ఉపేందర్, రమేశ్, అన్వర్‌పాష, రాజేశ్వర్‌రావు, తహసల్దార్ సరిత, డీటీ హేమ, గిర్దావర్ షఫీ అహ్మద్, వీఆర్‌వో బాబు, సతీష్, దాడి మ ల్లయ్య, కిరణ్, ఎస్సై మోహన్‌బాబు తదితరులున్నారు.

137
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles