గిరిజనులకు అండగా ఉంటాం..

Sat,May 19, 2018 03:07 AM

-స్వరాష్ట్రంలోనే దళితులకు న్యాయం n ఎస్సీ,ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
- కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం n పాల్గొన్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,
ఎమ్మెల్యే కోనప్ప, ఏఎస్పీ గోద్రు
ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ : గిరిజనుల సమస్య లు పరిష్కరించి వారికి అండగా ఉంటామని ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివా స్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ కమిటీ సమావేశానికి రాష్ట్ర కమిషన్ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలోనే దళితులకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి నెల 30న పౌరహక్కుల దినం నిర్వహించాలనీ, ఇందుకోసం జిల్లాలోని మండలాలు, గ్రామాల ను ఎంపిక చేసి షెడ్యూల్ తయారు చేసి తనకు పంపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసులు దాదాపుగా 43 నమోదుకాగా, అందులో 32 పరిశీలనలో, 7 పెండింగ్‌లో ఉం డగా, 4 కేసులు పరిష్కరించామని ఏఏస్పీ గోద్రు తెలిపారు. పెండింగ్ కేసులను ఈ నెల చివరిలోగా పరిష్కరించాలని చైర్మన్ సూచించారు. అ నంతరం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల హక్కులు, కేసుల విషయం లో చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. కేసులను ఏళ్ల పాటు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ఎనిమీయాతో బాధపడుతున్నారనీ, వారికి పోషకాహారం అం దించి రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్సీ, డీఎస్సీలు, కమిటీ సభ్యులు దేవయ్య, నరసింహా, రాంబాల్ నాయక్, విద్యసాగర్, నీలదేవి, కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles