దేశానికే ఆదర్శం రైతుబంధు

Sat,May 19, 2018 03:05 AM

రెబ్బెన : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రై తుబంధు పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మె ల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని కైర్ గాం, పులికుంట, రెబ్బెన, గంగాపూర్ గ్రా మాల్లో శుక్రవారం రైతుబంధు చెక్కులు, ప ట్టా, పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమం త్రి కేసీఆర్ రైతులు అందరూ సంతోషంగా ఉండాలని రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పంట పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ పథ కం అమలు చేస్తున్నారని చెప్పారు. తెలంగా ణ సర్కారు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మిని స్థానిక నాయకు లు శాలువా కప్పి సన్మానించారు. రైతులు ఇ బ్బంది పడకుండా టెంటు వేయడంతో పా టు చల్లనినీరు, మజ్జిగ అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కార్నాథం సంజీవ్ కుమా ర్, జడ్పీటీసీ అజ్మీర బాబురావు, సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, వైస్ ఎంపీపీ రేణుక, డైరెక్టర్‌లు పెసరి మధునయ్య, పల్లె రాజేశ్వర్‌రావు, ఉప సర్పంచ్ శ్రీధర్, రైతు సమన్వ య సమితి జిల్లా సభ్యులు చెన్న సోమశేఖర్, మండల కన్వీనర్ బోర్కుటే నాగయ్య, గ్రా మ కన్వీనర్ వెంకన్నగౌడ్, టీఆర్‌ఎస్ మండ ల అధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ జాకీర్ ఉస్మానీ, తహసీల్దార్ సా యన్న, వ్యవసాయశాఖ ఏడీ శ్రీనివాసరావు, ఏవో మంజుల, ఏఈవో అర్చన, ఆర్‌ఐ ఊ ర్మిల, మహేశ్, వీఆర్వోలు ఉంలాల్, దోని బాపు, మల్లేశ్, చంద్రమౌళి, వాసుదేవ్, నా యకులు మోడెం చిరంజీవి గౌడ్, మడ్డి శ్రీనివాస గౌడ్, దుర్గం భరద్వాజ్, సంఘం శ్రీనివాస్, వెంకటేశ్వరగౌడ్, అన్నుపూర్ణ అరుణ, మన్నెం పద్మ పాల్గొన్నారు.

127
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles