రైతుబంధుతో భరోసా

Sat,May 19, 2018 03:03 AM

- ఆర్డీవో రమేశ్‌బాబు
-దహెగాంలో చెక్కులు, పట్టాపాసు పుస్తకాల అందజేత

దహెగాం : రైతుల ఆర్థికాభివృద్ధికే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్నదని ఆర్డీవో రమేశ్‌బాబు అన్నారు. శుక్రవారం మండలంలోని గిరివెల్లిలో రైతులకు చెక్కు లు, పట్టాపాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని బుక్కుల్లో చిన్నచిన్న తప్పులు ఉన్నాయనీ, త్వరలోనే వాటిని సవరిం చి అందిస్తామన్నారు. ఈ సందర్భంగా కొందరు రైతు లు గ్రామంలో 339 మంది రైతుల ఉండగా, 241 మందికి చెక్కులు, పట్టా పాస్ పుస్తకాలు వచ్చాయనీ, మిగితా 91 మందికి రాలేదని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ పరిశీలన చేసి అందిస్తామని హామీనివ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో సర్పంచులు కోడెల బానక్క, సంగర్సు బాలకిషన్‌రావు, జడ్పీటీసీ లావుడె సుజాత, డీసీసీబీ డైరెక్టర్ తాళ్లపల్లి శ్రీరామరావు, రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్ కంభగౌని సంతోష్, తహసీల్దార్ బికర్నదాసు, వ్యవసాయాధికారి సంగీత, కాగజ్‌నగర్ రూరల్ సీఐ ప్రసాద్‌రావు, ఎస్‌ఐ రమేశ్, జూనియర్ అసిస్టెంట్ రామన్న, వీఆర్వోలు కిష్టయ్య, సురేశ్, బద్రుల్ల, భూమన్న దుర్గ య్య, బక్కుయ్య, ఏఈవోలు రాజశేఖర్, శోభన్, సాగ ర్, వెన్నల, లక్ష్మి, నాయకులు తుమ్మిడ మల్లేశ్, దామోదర్, ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన రైతుబంధు..
మండలంలో రైతు బంధు కార్యక్రమం శుక్రవారం ము గిసింది. 30 గ్రామాల్లో 8364 మంది రైతులు ఉండ గా, 6273 మందికి పట్టా పాస్ పుస్తకాలు, 9166 చెక్కులకు 6939 చెక్కులను అందజేసినట్లు అధికారులు తెలిపారు. మిగితా వారికి శనివారం నుంచి తమ కార్యాలయంలో అందించనున్నట్లు తహసీల్దార్ బికర్నదాసు తెలిపారు.
చింతలమానేపల్లి: మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ప్రకాశ్ చెక్కులు, పట్టాపాసు పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నాందేవ్, అర్టికల్చర్ అధికారిని శాంతి ప్రియదర్శిని, వీఆర్వోలు యూసూఫ్, సంతోష్, సత్త న్న, కాంతయ్య, ఏఈఓలు వెంకటేశ్, విజయ్, హెబ్జీ బా, కృపామణి, రెవెన్యూ సిబ్బందిపాల్గొన్నారు.

వారసంతలో అంబలి పంపిణీ ..
పెంచికల్‌పేట్ : మండలంలోని ఎల్కపల్లి వారసంతలో శుక్రవారం కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతులకు టీఆర్‌ఎస్ మం డల యూత్ అధ్యక్షుడు నగునూరి శ్రీనివాస్ అంబలి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విం డో డైరెక్టర్ దూగుంట రాజన్న, నాయకులు సత్యనారాయణగౌడ్, ముప్పిడి సత్తన్న, తదితరులు ఉన్నారు.
తప్పులు సరిచేసుకోండి..
కౌటాల: పట్టాపాసుపుస్తకంలో ఏవైనా తప్పులుంటే సరిచేసుకునే అవకాశం ఉందని, ఇందుకోసం శనివారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ యాకన్న శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అదే విధంగా చెక్కులు, పాసు పుస్తకాలు రానివారికి రెండో విడతలో అర్హులందరికీ పాసు పుస్తకాలు, చెక్కులు అందిస్తామని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

115
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles