రైతును రాజు చేయడమే లక్ష్యం

Thu,May 17, 2018 01:22 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : రైతును రాజు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. మండలంలోని గుండి, ఈదులవాడ, జన్కాపూర్, ద స్నాపూర్‌లో బుధవారం రైతులకు పట్టా పాసుపుస్తకాలు, చె క్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు విలువ పెంచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రైతు ఆనందంగా ఉంటేనే దేశం బాగుంటుందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనతో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు మోక్షం లభించిందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ అలీబీన్ అహ్మద్, సర్పంచులు కాశ య్య, సరస్వతి, దత్తు, ఉప సర్పంచ్ గోవింద్, ఎంపీటీసీలు రవీందర్, గోపాల్, సుగుణాకర్, ఆత్మ చైర్మన్ రమేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలువేరు వెంకటేశ్వర్లు, తహసీల్దార్ బౌమిక్, వ్యవసాయ అధికారి ఖాదర్‌హుస్సేన్, టీఆర్‌ఎస్ పా ర్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహమూద్, పట్టణ అధ్యక్షుడు అహ్మద్‌బీన్ అబ్ధుల్లా, నాయకులు సింగాడే అశోక్, డాక్టర్ రమేశ్, సాంగ్డె జీవన్ తదితరులున్నారు.

అన్నదాత సంక్షేమానికే రైతుబంధు : జేసీ
వాంకిడి : అన్నదాతల సంక్షేమానికే ప్రభుత్వం రైతుబంధు ప థకాన్ని ప్రవేశపెట్టిందని జీసీ అశోక్ కుమార్ అన్నారు. మం డలంలోని బంబార, దాబా, ఇందాని గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకంతో పాటు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జీసీ మాట్లాడారు. జిల్లాలోని ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాదారు ఉన్న రైతులకు సైతం రైతుబంధు చెక్కులు అందించనున్నట్లు తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు చనిపోయిన వారి కుటుంబాలకు విరాసత్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న అటవీహక్కుల భూ ముల కేసులు త్వరలో పరిష్కరిస్తామన్నారు. 20 నుంచి ఏ జెన్సీ గిరిజన రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అలీం అహ్మ ద్, హార్టికల్చర్ జిల్లా అధికారి పాషా, ఎంపీపీ దుర్గం ఆర్థిక, మండల ఉపాధ్యక్షుడు గోల్ల, తహసీల్దార్ మల్లికార్జున్, ఏవో మిలింద్ కుమార్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు అజయ్ కు మార్, నాయకులు జైరాం, గులాబ్, తదితరులు ఉన్నారు.

అర్హులైన ప్రతి రైతుకూ చెక్కులు : డీఆర్వో
జైనూర్ : అర్హులైన ప్రతి రైతుకూ చెక్కులు, పట్టాపాస్ పుస్తకా లు అందుతాయని ఇన్‌చార్జి డీఆర్వో కదం సురేశ్ తెలిపారు. మండలంలోని రాసిమెట్ట, జంగాం, ఉషెగాం రెవెన్యూ గ్రా మాల్లో చెక్కులు, పాస్‌బుక్కులు పంపిణీ చేశారు. రాసిమెట్ట లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దే శంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని టెంట్లు, తాగునీటి వసతి కల్పించామని, వైద్యసిబ్బంది ని అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాలా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావు, జడ్పీటీసీ అస్రఖానం, మా ర్కెట్ కమిటీ చైర్మన్ కుమ్ర భగవంత్‌రావు, సర్పంచులు అ ర్జున్, మోతుబాయి మాదవ్‌రావు, గోవింద్‌రావు, తహసీల్దార్ భుజంగ్‌రావు, మండల వ్యవసాయ శాఖ అధికారి పవ న్ కుమార్, ఏఈవోలు వీరా, సంకీర్తన తదితరులున్నారు.

ఇది రైతు ప్రభుత్వం : యాదవరావు
సిర్పూర్(యు) : ఇది రైతు ప్రభుత్వమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు అన్నారు. మండల కేంద్రంలో రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులను గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో రైతు స మన్వయ సమితి మండల అధ్యక్షుడు ఆత్రం భగవంత్‌రావు, సర్పంచ్ ఆత్రం ఓంప్రకాశ్, అర్క నాగోరావు, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తొడసం ధర్మరావు, తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్, రైతు లు ఉన్నారు.

రైతుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్
లింగాపూర్ : రైతుల అత్మబంధువు సీఎం కేసీఆర్ అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావు అన్నారు. మండలంలోని చోర్‌పల్లి గ్రామంలో బుధవారం రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ వారిని ఆదుకునేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అంబు పోల్లాజీ, సర్పంచ్ వేర్కడ సత్తుబాయి, ఆర్‌ఐ విలాష్, సీనియర్ అసిస్టెంట్ అనితా, మాజీ సర్పంచ్ జంగు, టీఆర్‌ఎస్ నాయకులు శంకర్, మోతిరాం, ఎస్‌ఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

రైతుబంధును సద్వినియోగం చేసుకోవాలి : జడ్పీటీసీ కమల
తిర్యాణి : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభు త్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ వెడ్మ కమల అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రైతుబంధు చె క్కులు, పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తోందని తెలిపారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ అమృత్‌సాగర్, ఏవో తిరుమలేశ్వర్, ఆర్‌ఐ అచ్యుత్‌రావు, ఏఎస్‌వో తిరుపతి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బొమ్మగోని శంకర్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ రాజన్న, జాగృతి మండల అధ్యక్షుడు వెడ్మ యశ్వంత్‌రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, వీఆర్వోలు, టీఆర్‌ఎస్ నాయకులు, రైతులు ఉన్నారు.

రైతన్నకు అండగా సర్కార్ : ఎంపీపీ
రెబ్బెన : టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతన్నకు అండగా ఉందని ఎంపీపీ కార్నాథం సంజీవ్ కుమార్ అన్నారు. మండలంలోని నేర్పల్లి, కొమురవెళ్లి గ్రామాల్లో బుధవారం రైతుబంధు చెక్కులు, పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు సంతోషంగా ఉండాలని రైతుబంధు పథకం అ మలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సాయన్న, వ్యవసాయాధికారి మంజుల, రైతు సమన్వయ స మితి జిల్లా సభ్యులు చెన్న సోమశేఖర్, మండల కన్వీనర్ బో ర్కుటే నాగయ్య, ఆర్‌ఐలు ఊర్మిల, మహేశ్, ఏఎస్‌వో కల్యా ణ్, సీనియర్ అసిస్టెంట్ అశోక్, ఏఈవో అర్చన, బీటీఎం గురుమూర్తి, వీఆర్‌వోలు చంద్రమౌళి, బాపు, ఉంలాల్, మల్లేశ్, ఉప సర్పంచ్ శ్రీధర్, శ్రీనివాసగౌడ్ ఉన్నారు.

పెట్టుబడిని సద్వినియోగం చేసుకోండి
కెరమెరి : ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడిని రైతులు సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడి సాధించాలని జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. మండలంలోని దేవుడ్‌పల్లిలో జేసీ అశోక్‌కుమార్, దేవాపూర్‌లో ఆర్డీవో సురేశ్ హాజరై బుధవారం రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి రైతుకూ పంట పెట్టుబడి ఇచ్చి వారిలో మనోధైర్యం కల్పించడమే ప్రభుత్వం ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో డీఏవో అలీం అహ్మద్, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీపీ మాచర్ల గణేశ్, డిప్యూటీ తహసీల్దార్ గోడం సంతోష్ కుమార్, ఆర్‌ఐ వెంకట్‌రావ్, సర్పంచ్ రాథోడ్ శంకర్, వ్యవసాయ అధికారి గోపికాంత్, ఏఈవో వెంకటేశ్, వీఆర్వోలు దుర్గం తుకారాం, గేడం నారాయణ రైతులు తదితరులు పాల్గొన్నారు.

124
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles