పవిత్రం రంజాన్ మాసం..


Thu,May 17, 2018 01:21 AM

-నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం
-ప్రత్యేక నమాజ్‌కు మసీదులు సిద్ధం
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : ముస్లింల పవిత్రమైన పండుగ రంజాన్ మాసం నేటి(ఈ నెల 17) నుంచి ప్రారంభం కానున్నది. రంజాన్ మాసం ప్రా రంభమైనప్పటి నుంచి నెల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఉద యం 5గంటలకు మధ్యాహ్నం ఒంటి గంటకు, సా యంత్రం 5గంటలకు, 7గంటలకు రాత్రి 8-30 గం టలకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. దానధర్మా లు, నమాజులు చేస్తూ.. ఖురాన్ పఠిస్తూ ఎంతో నిష్ఠ గా ఉంటూ కఠిన నియమాలతో ఉపవాసాలు ఉం టారు. ఈ నెలలో ఒక్క రోజు ఉపవాసం ఉంటే 40 రోజులు ఉపవాసం ఉన్నంత పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జిల్లాలోని మంచిర్యాలలో రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేకంగా హలీం, హరీస్ సెంటర్స్‌ను ఏర్పాటుచేస్తారు. ఈ నెలలో ముస్లింలు షాపింగ్ ఎక్కువగా చేస్తారు. యువకులు, మహిళలైతే పండుగ నాడు తాము ధరించే ప్రతీ వస్తువు కొత్తగా ఉండాలని కోరుకుంటారు. దీంతో బజార్లన్నీ ముస్లింలతో కళకళలాడతాయి. ముఖ్యంగా బట్టలు, గాజులు, నగల షాపులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. జిల్లాలోని పేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ శాఖ ద్వారా ఇఫ్తార్ ఇవ్వడంతో పాటు దుస్తులు అందజేయనున్నారు. జిల్లాలో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, జైనూర్ ఏరియాల్లో రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఉదయం సహర్‌తో ఉపవాస దీక్ష ప్రారంభించి సాయంత్రం ఇఫ్తార్‌తో విరమిస్తారు. ఈ విధంగా రంజాన్ మాసం కొనసాగుతుంది.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...