ఆరు రోజులు రూ.65 కోట్లు

Wed,May 16, 2018 02:00 AM

-జిల్లాలో ఇప్పటివరకు రైతు బంధు ద్వారా పంపిణీ
-ఇప్పటికే 329 గ్రామాల్లో 50 వేల చెక్కుల అందజేత
-బ్యాంకుల వద్ద ఇబ్బందుల్లేకుండా నగదు ఉపసంహరణ
-సభకు రాలేని వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
-సాయం అందడంతో ఆనందంలో అన్నదాతలు
-విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సమాయత్తం
-షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్న కార్యక్రమం
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా రైతు బంధు పథకం రైతన్న ఇంటా సంతోషాన్ని నింపుతున్నది. గత ఆరు రోజులుగా జిల్లాలోని 329 గ్రామాల్లో దాదాపు రూ. 65 కోట్ల విలువ చేసే సుమారు 50 వేల చెక్కులను ప్రజా ప్రతినిధులు, అధికారులు పంపిణీ చేశారు. వానాకాలం సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో పెట్టుబడుల కోసం అప్పులు చేసేందుకు వడ్డీ వ్యాపారుల చుట్టూ రైతులు తిరుగాల్సిన సమయంలో రైతు బంధు చెక్కులు ప్రభుత్వం పంపిణీ చేస్తుండడంతో, అన్నదాతల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. గ్రామ సభల్లో చెక్కులు తీసుకుంటున్న అన్నదాతలు నేరుగా బ్యాంకులకు వచ్చి గౌరవంగా చెక్కులను నగదుగా మార్చుకొంటున్నారు. జిల్లాలోని 412 గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికే 329 గ్రామాల్లో అధికారులు పూర్తి చేశారు.

వారం రోజుల్లో 50 వేల చెక్కులు పంపిణీ..
ఈనెల 10 న గ్రామాల్లో ప్రారంభమైన రైతు బంధు చెక్కుల పంపిణీ పండుగ వాతారణంలో కొనసాగుతోంది. ఏ గ్రామాన్ని చూసినా, చెక్కులు, పట్టాపాస్ పుస్తకాల పంపిణీ సందడి నెలకొంది. చెక్కులు పంపిణీచేసేందుకు వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులను మేళతాళాలతో స్వాగతిస్తున్న రైతులు చెక్కులు, పట్టాలను తీసుకుంటున్నారు. మంగళ వారం నాటికి జిల్లాలోని 15 మండలాల్లో సుమారు 53వేల చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు దాదాపు 50 వేల చెక్కులు పంపిణీ చేశారు. జిల్లాలోని రూ. 412 గ్రామాల్లో 125 కోట్ల 13 లక్షల 24360 విలువ చేసే 93,779 చెక్కులను అందించాల్సి ఉంది. వివిధ కారణాలతో గ్రామ సభలకు రాని రైతుల చెక్కులు భధ్రంగా అధికారుల వద్దే ఉంచుతున్నారు. షెడ్యూల్ ప్రకారం పంపిణీ ముగిసినా, తరువాత మిగిలిపోయిన వారికి మరో సారి సభలు ఏర్పాటు చేసి పంపిణీచేయనున్నారు..

రైతు బంధు తెచ్చిన ధైర్యం...
అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగిపోయే రైతులకు రైతు బంధు పథకం ధైర్యాన్ని ఇచ్చింది. వ్యవసాయ పెట్టుబడుల కోసం కాళ్లరిగేలా తిరుగాల్సిన పనిలేకుండా ప్రభుత్వమే పెట్టుబడి సహాయాన్ని అందించడంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలుచేసేందుకు సిద్ధమవుతున్నారు.
రైతుల చేతికి రూ. 65 కోట్లు...
వ్యవసాయ పెట్టుబడి కింద దాదాపు 65 కోట్లరూపాయల చెక్కులను ఇప్పటివరకు రైతుల చేతికి చేరాయి. ఈనెల 14 వరకు జిల్లాలోని 15 మండలాల్లో 282 గ్రామాల్లో 39, 390 చెక్కులను పంపిణీచేయగా మంగళవారం మరో 47 గ్రామాల్లో 10, 600 చెక్కులను రైతులకు అందజేశారు.

146
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles