అన్నదాతల్లో ఆనందం

Wed,May 16, 2018 01:58 AM

-ఎమ్మెల్యే కోవ లక్ష్మి
-పలు గ్రామాల్లో చెక్కులు పంపిణీ
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ / వాంకిడి / లింగాపూర్ : సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, రైతుబంధు పథకంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంటలో, వాంకిడి మండలంలోని ఇందాని, గుంజాడ, చౌపన్‌గూడ, బంబారలో, లింగాపూర్ మండలం లొద్దిగూడ గ్రామ పంచాయతీలోని మారుమూల గిరిజన గ్రామమైన దాంపూర్‌లో మంగళవారం రైతులకు పట్టా పాసుపుస్తకాలు, రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు రైతులకు చుక్కలు చూపిస్తే... సీఎం కేసీఆర్ చెక్కులు అందిస్తున్నారని తెలిపారు. అన్నదాతల ఆత్మబంధువు టీఆర్‌ఎస్ ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారన్నారు. లింగాపూర్ మండలం కంచన్‌పల్లి గ్రామ పంచాయతీలోని ఘుమ్నూర్ గ్రామంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావ్ రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో జేసీ అశోక్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, ఆసిఫాబాద్ తహసీల్దార్ బౌమిక్, సర్పంచ్ రామ్‌షా, నాయకులు అరిగెల మల్లికార్జున్, పెందుర్ సుధాకర్, వాంకిడి ఎంపీపీ దుర్గం ఆర్థిక, మండలాధ్యక్షుడు దేవినేని గోల్ల, బంబార సర్పంచ్ అప్పాల సంతోష్, ఎంపీటీసీ వినోద్, కో-ఆప్షన్ ఎస్‌కే షఫిక్, రైతు సమితి మండల కో-ఆర్డినేటర్ పెంటు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు అజయ్ కుమార్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్వర్, తహసీల్దార్ మల్లికార్జున్, ఏవో మిలింద్‌కుమార్, ఎస్‌ఐ రాజు, ఆర్‌ఐ దౌలత్, ఏఈవోలు, టీఆర్‌ఎస్ నాయకులు జైరాం, వనపర్తి సదాశివ్, హార్టికల్చర్ జిల్లా అధికారి మీర్‌పాషా, లింగాపూర్ వైస్ ఎంపీపీ గౌరిబాయి గన్‌పత్ జాదవ్, సర్పంచ్ సులోచన, టీఆర్‌ఏస్ మండలాధ్యక్షుడు చౌహన్ బాపురావ్, లింగాపూర్ తహసీల్దార్ మష్కుర్ అలీ, నాయకులు బోడా బాపూరావ్, కిషన్, సంతోష్ పాల్గొన్నారు.

182
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles