ప్రతీ పల్లె ప్రగతి బాటలో నడువాలి


Wed,May 16, 2018 01:58 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : ప్రతీ పల్లె ప్రగతి బాటలో నడువాలని డీఆర్డీవో వెంకట్ అన్నారు. మండలంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళా రైతు సంఘాల సభ్యులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులకు సీడ్ ఫండ్ నిధులు అందించాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో 108 మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సీడ్ ఫండ్ రూ.27 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా ఉత్పత్తి సంఘాల సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని రూ.5 వేలతో సంఘ నిర్వహణ సామగ్రి, రూ.20 వేలతో వ్యవసాయ విత్తనాలు, ఎరువులు, పనిముట్లు కొనుగోలు చేసి వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలన్నారు. వానాకాలంలో కూరగాయలసాగు, కందులు, పెసర్లు, చిరుధాన్యాల సాగు విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపీడీ రామకృష్ణ, డీపీఎం యాదగిరి, ఏపీఎంలు మహేశ్, సదానందం, రమణ, ప్రమోద్, మహిత కుమారి, ఎస్‌హెచ్‌టీ రమేశ్, పీఎంఎల్‌ఏ శంకరయ్య, సీసీ పాల్గొన్నారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...