రైతుబంధు దేశానికే ఆదర్శం


Wed,May 16, 2018 01:58 AM

-ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
-దహెగాం, బెజ్జూర్, పెంచికల్‌పేట్, చింతలమానేపల్లి, కౌటాలలో చెక్కులు, పట్టాపాసు పుస్తకాల పంపిణీ
-సద్వినియోగం చేసుకోవాలని సూచన
దహెగాం: రైతు బంధు పథకం దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని బీబ్రా, హత్తిని గ్రామాల్లో మంగళవారం రైతులకు చెక్కులు, పట్టాపాస్‌పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ భూముల ను సాగు చేసుకుంటున్న రైతులు, అధైర్య పడవద్దనీ, వారికి కూడా త్వరలోనే పట్టాపాస్ పుస్తకాలను ప్రభు త్వం అందిస్తుందన్నారు. త్వరలోనే జగన్నాథ్‌పూర్ ప్రాజెక్ట్ నుంచి కాల్వల ద్వారా పీపీ రావు ప్రాజెక్ట్‌లోకి నీటిని తీసుకవచ్చి ఆయకట్టు రెండు పంటలకు సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లావుడె సుజాత, డీసీసీబీ డైరెక్టర్ తాళ్లపల్లి శ్రీరామరావు, రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్ కంభగౌని సంతోష్‌గౌడ్, సర్పంచ్‌లు దిగువ స్వ ప్న, గొడిషల శంకర్ గౌడ్, తహసీల్దార్ బికర్నదాసు, వ్యవసాయ అధికారి సంగీత, జూనియర్ అసిస్టెంట్ రా మన్న, వీఆర్వోలు బక్కయ్య, దుర్గయ్య., సురేశ్, ఏఈవోలు సాగర్, లక్ష్మి, నాయకులు ప్రసాద్‌రాజ్, ధనుంజయ్, పుప్పాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...