కిరాతకం

Wed,May 16, 2018 01:57 AM

-ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
-ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం
-రెబ్బెన మండలం కిష్టాపూర్‌లో ఘటన
రెబ్బెన: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి తాళి కట్టిన భర్తను భార్య హతమార్చిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామం లో కలకలం రేపింది. రెబ్బెన ఎస్‌ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం..కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నర్సయ్య (36) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం దుర్గం నర్సయ్యకు జ్యోతితో వివాహం కాగా, వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఆరు నెలల నుంచి జ్యోతి అదే గ్రామానికి చేందిన దుర్గం శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఇటీవల నర్సయ్యకు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా ఘర్షణ చోటు చేసుకుంది. రాత్రి భోజనం పూర్తి చేసుకొని నర్సయ్య ఇంటి ఎదుట మంచంపై పడుకున్నాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన జ్యోతి భర్తను అంతం చేయాలని నిశ్చయించుకుంది. ప్రియుడు శ్రీనివాస్‌ను పిలిపించుకుంది. ఇద్దరు కలిసి నర్సయ్య గొంతు నులిమి హత్య చేశారు. నర్సయ్యను హత్య చేసిన అనంతరం ఇంట్లో చీరతో ఉరి వేసి, ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. నర్సయ్య గొంతుపై గాయాలను గుర్తించి దర్యాప్తు మమ్మురం చేశారు. భార్యపై అనుమానం రావడంతో లోతుగా విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయట పడింది. నర్సయ్య తమ్ముడు సంతోశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.

165
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles