అప్పుచేయకుండావ్యవసాయం

Tue,May 15, 2018 02:42 AM

-ఇదే రాష్ట్ర సర్కారు ప్రధాన లక్ష్యం
-అన్నదాతను ఆదుకునేందుకే రైతు బంధు
-రుణమాఫీతో పాటు పెట్టుబడి సాయం అందించిన ఘనత కేసీఆర్‌దే..
-సంక్షేమ పథకాల అమలులో మొదటిస్థానంలో తెలంగాణ
-ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం, రామన్న
-ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లో 222 మందికి చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ
-18 మందికి సబ్సిడీ ట్రాక్టర్ల అందజేత
-పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ సతీశ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణలో అన్నదాతలు అప్పు చేయకుండా వ్యవసాయం చేయాలనే ప్రధాన ధ్యేయంతోనే సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన రైతు బంధు కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగురామన్న, ఎంపీ నగేష్‌లతో కలిసి ఆయన హాజరయ్యారు. ఉదయం 9.45 కు హెలికాప్టర్ ద్వారా ఆసిఫాబాద్ చేరుకున్న మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాబాపూర్‌లో ఏర్పాటుచేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతులకు మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎన్నోకష్టాలు పడ్డారనీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక రుణమాఫీ చేయడంతో పాటు 24 గంటల కరెంట్‌ను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

భూరికార్డుల ప్రక్షాళనతో భూవివాదాలు లేకుండా రికార్డులు తయారు చేసి రైతులకు పెట్టుబడి సహాయంతో పాటు వ్యవసాయ అనుభంధ రంగాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.రాష్ట్రంలో 40 శాతం వివాదస్పద భూములు ఉంటే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వంద రోజుల్లో సరిచేశారనీ, ఇప్పుడు 95 శాతం భూములు ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్నాయన్నారు. వీటి ఆధారంగా రాష్ట్రంలోని రైతులందరికీ పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. క్తొతగా ఇచ్చే పట్టా పాస్‌పుస్తకాల్లో 17 రకాల సెక్యూరిటీ ఫీచర్స్ కలిగి ఉన్నాయని తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా రూ. 12 వేల కోట్లను రైతులకు పెట్టుబడి సహాయం కింద అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ. 623 కోట్ల తో రుణ మాఫీ పూర్తి చేసినట్లు చెప్పారు. రైతు సంక్షేమ పథకాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమం అనంతరం 222 మంది రైతులకు చెక్కులు, పట్టా పాస్‌పుస్తకాలు, 18 మందికి సబ్సీడీ ట్రాక్టర్లు అందించారు.

జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు
జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేలా చ ర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రైతులను ఆదుకునేందుకు బిందు సేద్యం యూనిట్లు ఎక్కువగా మంజూరు చేయాలని స్థా నిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరగా, పూర్తి స్థాయి ప్రతిపాదనలు చేసి పంపాలనీ, ప్రత్యేక కోటా కింద అందజేస్తామని చెప్పారు. ఇదే విధంగా కు మ్రం భీం ప్రాజెక్ట్ కాలువల పునరుద్ధరణకు రూ. 75 కోట్లు వచ్చేలా సీ ఎంను కలిసి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్‌కు చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ సాధిస్తున్న ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, రైతు బంధు పథకాన్ని అన్ని రాష్ర్టాలతో పాటు కేంద్రం కూడా గమనిస్తోందన్నారు.

ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు లక్ష మంది రైతులకు 3 లక్షల 15వేల ఎకరాల భూమి ఉందనీ, వీరికి రైతు బంధు పథకం ద్వారా సుమారు 125 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. రైతుల 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతోపాటు చెరువులను పునరుద్ధరించి సాగునీరు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు పండ్లతోటల పెంపకానికి ప్రాధాన్యతను ఇస్తున్నామని ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90 శాతం సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నామన్నారు. ఆసిఫాబాద్‌లో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

పోడు పట్టాలకూ రైతు బంధు: ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి
జిల్లాలో అటవీ భూములు సాగు చేసుకుంటూ అటవీ హక్కుల పత్రాలు కలిగిన వారందరికీ రైతు బంధు పథకాన్ని వర్తింపజేస్తామని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలో 12 వేల మంది గిరిజన రైతులకు అటవీ హక్కుల పత్రాలు ఉన్నాయనీ, వీరి వద్ద సుమారు 2 లక్షల 98 వేల ఎకరాల అటవీ భూములకు పట్టాలు ఉన్నాయన్నారు. ఈ రైతులు అధైర్యపడాల్సిన పనిలేదనీ, అందరికీ పెట్టుబడి సహాయం అందిస్తామన్నారు.

అన్నదాతలను ఆదుకున్నది కేసీఆరే..: మంత్రి రామన్న
దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకుంటున్నది సీఎం కేసీఆరేనని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. రైతుంలందరికీ పెట్టుబడి సాయం అందుతుందన్నారు. రైతుల కోసం ప్రవేశపెడుతున్న పథకాలను జీర్ణించుకోలేకే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కంటి వెలుగులు కార్యక్రమంలో ముందుగా వారే చికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెక్కులు తీసుకున్న రైతులకు బ్యాంకుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుందన్నారు.

రైతులకు స్వర్ణయుగం: ఎంపీ నగేశ్
రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తుందని ఎంపీ నగేష్ అన్నారు. రైతులకు రుణమాఫీ, 24 గంటల కరెంట్‌తో పాటు పెట్టుబడి సహాయం అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలోనే రైతులకు ఇన్ని సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
గూడాల్లో రైతుల పండుగ: ఎమ్మెల్యే కోవలక్ష్మి
రైతు బంధు పథకంతో జిల్లాలోని ప్రతి గూడాలో అన్నదాతల పండుగ జరుగుతున్నదని ఎమ్మెల్యే కోవ లక్ష్మిఅన్నారు. దేశంలో ఓ మంచి ఆలోచనకు సీఎం కేసీఆర్ కార్యరూపం చూపించారు. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నారు. ఇకపై రైతులకు మంచి రోజులు రానున్నాయనీ, నియోజకవర్గంలోని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

దేశానికే ఆదర్శం: ఎమ్మెల్సీ పురాణం సతీశ్
రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ అన్నారు. రైతులు అప్పులతో సతమతం కాకుండా ఉండేందుకు సీఎం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గతంలో తీసుకున్న రుణాలను మాఫీ చేయడంతోపాటు, పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారని గుర్తు చేశారు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి సాగునీరు అందిస్తున్నారనీ, ప్రాజ్టెకులను ఏర్పాటు చేసి సాగునీటి వసతి కల్పిస్తున్నారని పేర్కొన్రాఉ. సమాజంలో రైతులు గౌరవంగా బతుకేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు.

అలరించిన గుస్సాడీ న్యుతాలు.
బాబాపూర్ రైతుబంధు సభా ప్రాంగణంలో తిర్యాణి గ్రామానికి చెం దిన గిరిజన కళాకారులు గోడీ ఆటపాటలతో చేసిన గుస్సాడీ నృత్యాలు అలరించాయి. కాగా సభకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బాబాపూర్ ఇతర మండలాలనుంచి ప్రజలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు తాగునీటి, వైద్యసదుపాయాలు కల్పించారు.

152
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles