అధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలి

Tue,May 15, 2018 02:37 AM

-అడిషనల్ ఎస్పీ గోద్రు
ఆసిఫాబాద్ రూరల్: ప్రజల విశ్వాసం చూరగొనేలా జిల్లాలోని పోలీస్ అధికారులు తమ పనితీరును మెరుగు పరుచుకోవాలని అడిషనల్ ఎస్పీ గోద్రు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లాలోని ప్రజలు ఆయా సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా గోద్రు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదులపై సంబంధిత అధికారులు తక్షణం స్పందించాలన్నారు. ఎలాంటి స మస్యలైన వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎస్పీలు మంజూర్, కిరణ్ కుమార్ , ఏవో భక్త ప్రహ్లాద్, సీ నియర్ అసిస్టెంట్ అజయ్‌వర్మ, ఎస్బీ ఇన్స్‌పెక్టర్ కాశయ్య, ఫిర్యాదుల విభాగం అధికారిణి సునిత, పీఆర్‌వో మనోహర్ పాల్గొన్నారు.

152
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles