విద్యుదాఘాతంతో యువకుడి మృతి


Sun,May 13, 2018 02:34 AM

రెబ్బెన : విద్యుత్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఓ యువకుడి ప్రాణం పోయింది. ఈ ఘటన మండలంలోని కైర్‌గూడలో శనివారం చోటు చేసుకుంది. రెబ్బెన ఎస్‌ఐ శివకుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా.. కైర్‌గూడకు చెందిన మేడి భీమేశ్(26) అటవీశాఖలో వాచర్‌గా పని చేస్తున్నాడు. భార్య శరణ్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో ఇంటి ముందు ఉన్న రేకులషెడ్డులో శనివారం కూలర్ ఏర్పాటుకు చేసేందుకు ప్లగ్‌ను ఎక్స్‌టెక్షన్ బాక్స్‌కు అమర్చాడు. దానికి దగ్గర ఉన్న విద్యుత్ మీటరు సర్వీసు వైరు కింద ఉండడంతో, దానిని సరిచేసే ప్రయత్నం చేశాడు. మీటరుకు అమర్చు సర్వీసు వైర్‌తో పాటు జే-వైరు విద్యుత్ స్తంభం వద్ద తీగలకు ఆనుకొని ఉండగా, విద్యుదాఘాతంతో భీమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భీమేశ్‌ను కాపాడేందుకు యత్నించిన తండ్రి భీమయ్యకు కూడా విద్యుత్‌షాక్ తగిలింది. స్వల్పంగా గాయమైంది. వారం క్రితం ధీన్‌దయాల్ ఉపాధ్యాయ పథకం కింద భీమేశ్ ఇంట్లో కొత్త మీటరు భిగించారు. కాంట్రాక్టర్ సర్వీసు వైరును విద్యుత్‌పోల్‌కు అమర్చుక్రమంలో వైరులకు తాకుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మేడి భీమేశ్ భార్య శరణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు అత్తరొద్దీన్, తన్వీర్‌పాషా, మహముద్‌షరీఫ్ అత్యవసర సాయం కింద రూ. 5 వేలు అందించారు. గోలేటి సర్పంచ్ తోట లక్ష్మన్, ఎంపీటీసీ వనజ ఘటనా స్థలాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...