తీరనున్న వంతెన వెతలు

Sun,May 13, 2018 02:33 AM

-చింతగూడ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు
-రూ. 4.50 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు
-నెరవేరనున్న దశాబ్దాల కల
-హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
-కేసీఆర్, కేటీఆర్, కోనప్ప చిత్ర పటాలకు పాలాభిషేకం
కాగజ్‌నగర్ , నమస్తే తెలంగాణ : కాగజ్‌నగర్ మండలం చింతగూడ వాగుపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 4.50 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాల కల నెరవేరుతుండడంతో గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో వాగుపై వంతెన నిర్మించాలంటూ ప్రజలు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. ఏ ఒక్కరూ తమ సమస్య పట్టించుకోలేదని వారు పేర్కొంటున్నారు. ఏటా వానకాలంలో లో లెవల్ వంతెనపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంవల్ల రాకపోకలు నిలిచిపోయేవనీ, సర్‌సిల్క్ మిల్లు యజమాన్యం ఏర్పాటు చేసిన ఇనుప వంతెనపై కాలినడక, సైకిళ్లపై రాకపోకలు సాగేవని గ్రామస్తులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 31న చింతగూడ గ్రామాన్ని మంత్రి జోగు రామన్న, స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి సందర్శించారు. గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వం తెన నిర్మాణం చేపడుతామని ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరయ్యాయి.

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles