రైతుబంధుకు సర్వం సిద్ధం

Thu,May 10, 2018 02:28 AM

కోటపల్లి : రైతులకు వెన్నెదన్నుగా ఉం డేందుకు రూపొందించిన రైతుబంధు పథ కం అమలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం అం దించి, అ ప్పుల నుంచి విముక్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రైతుబం ధు పథకం చెక్కులు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. రైతును రుణాల నుంచి విముక్తి చేసి, నేనున్నానని భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబం ధు పథకం రూపొందించిన విషయం తెలసిందే. మరో ఆరు రో జుల్లో ఈ పథకం ప్రా రంభం కానుండడంతో రైతులు జేజేలు పడుతున్నారు. పంటలు సాగు చేసే రైతుల కు ఎకరాకు 4 వేల పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి చెక్కులు ఇప్పటికే ఆయా మండలాలకు చేరి భద్రంగా ఉన్నాయి. ఖరీఫ్‌లో పం టలు సాగు చేసే రైతులకు 4వేలు, రబీలో సాగు చేస్తే మరో 4 వేలు మొత్తంగా 8వేలు రైతులకు పెట్టుబడి రాయితీ కింద అం దించేందుకు ఈ పథకం రూపొందించింది. గురువారం నుంచి ప్రారంభమయ్యే చెక్కు ల పంపిణీ పండగ 18 వరకు కొనసాగనుం ది. ప్రతి రైతుకు చెక్కును అందించాలనే ఉద్దేశంతో అధికారులు ఇప్పటికే అవగాహ న సదస్సులు నిర్వహించారు. గ్రామాల్లో చె క్కుల పంపిణీ కార్యక్రమంపై జోరుగా ప్ర చారం నిర్వహిస్తున్నారు. ముందస్తుగా గ్రా మంలో సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు రైతు సమన్వయ సమి తుల మండల, గ్రా మ కన్వీనర్లు, సభ్యులకు సమాచారం అం దించి వారిని ఈ పథకంలో భాగస్వాములను చేస్తున్నారు. చెక్కుల పంపిణీ చేసే చో ట ఫిర్యాదుల స్వీకరణకు ఒక అధికారితో పాటు పర్యవేక్షణ కోసం మరో అధికారిని అందుబాటులో ఉంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పంపిణీ కార్యక్రమం లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.

43,012 మందికి లబ్ధి
రైతుబంధు పథకం ద్వారా చెన్నూర్ డివిజన్‌లో 43,012 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. చెన్నూర్ డివిజన్ పరిధిలో కోటపల్లి, చెన్నూర్, భీమారం, జైపూర్, మందమర్రి మండలాలు ఉండగా, చె క్కుల పంపిణీకి అధికారులు చకచకా ఏర్పా ట్లు చేస్తున్నారు. డివిజన్‌లోని 43,012 మంది రైతులకు పంపిణీ చేసేందుకు 43318 చెక్కులు రాగా 41,47, 23040 చెక్కుల రూపంలో అందించనున్నారు. భీ మారం మండలంలో 4274 మంది పట్టాదారులకు గాను 4319 చెక్కులు వచ్చాయి. 39,88,2360 సాయం అందనుంది. చెన్నూర్ మండలంలో 13060 మంది పట్టాదారులకు గాను 13119 చెక్కులు రాగా 12,19,08730, జైపూర్ మండలంలో 10226 మంది పట్టాదారులకు గాను 10304 చెక్కులు రాగా 95,15, 2490, కోటపల్లి మండలంలో 10364 మంది పట్టాదారులకు 10424 చె క్కులు రాగా 10,54, 29,920, మందమర్రి మండలంలో 5088 మంది పట్టాదారులకు గాను 5152 చెక్కులు రాగా 5,23, 49540 పంపిణీ చేయనున్నారు.

178
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles