ఉపాధిలో ప్రక్షాళన!

Tue,January 23, 2018 01:57 AM

-ఈజీఎస్‌లో శ్రమశక్తి సంఘాల పునరుద్ధరణకు కసరత్తు
-పనిచేయని వాటిని తొలగించి.. కొత్తవి ఏర్పాటు
-సామాజిక వర్గాలవారీగా మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం
-సిద్ధమవుతున్న 2018-19 ప్రణాళికలు
-గతేడాదికంటే ఎక్కువ పనిదినాలు కల్పించడమే లక్ష్యం

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ;జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో శ్రమశక్తి సంఘాల ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఏళ్లకేళ్లుగా పనిచేయని సంఘాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నది. సక్రమంగా పనులు చేపట్టేందుకు అవసరమైన మేట్లను నియమించనుండగా, ఎప్పటికప్పుడూ వివరాలు నమోదు చేసే అవకాశమున్నది. గతేడాది 60 లక్షల 32 వేల 929 పని దినాలు లక్ష్యంగా పెట్టుకోగా, 2018-19లో అంతకుమించి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నది.

నమస్తే తెలంగాణ: జిల్లాలో దాదాపు 8680 శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి. జిల్లాలో కొన్ని సంఘాలు ఉపాధి హామీ పనులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుండ గా, మరికొన్ని సంఘాలు ఉపాధి పనులకు దూరం గా ఉంటున్నాయి. జిల్లాలో 2017-18లో ఉపాధి హామీ పనులు చేయని సంఘాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త సంఘాలను ఏర్పాటు చేసి పనులు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గతేడాది జిల్లాలో సుమారు 4554 కు టుంబాలు 100 రోజుల పనిని సద్వినియోగం చేసుకున్నాయి. 25 రోజుల లోపు పని చేసిన సంఘా లు 492 ఉండగా, 50 రోజుల లోపు పనిచేసిన సం ఘాలు 365, 75 రోజుల లోపు పనిచేసిన సంఘా లు 302 ఉన్నాయి. 75 రోజుల కంటే ఎక్కువ రోజు లు పనిచేసిన కుటుంబాలు 1846 వరకు ఉన్నట్లు తెలుస్తున్నది. 100 రోజుల పని దినాలను 4554 కుటుంబాలు పూర్తిగా ఉపయోగించుకున్నాయి. మరికొన్ని సంఘాల్లో పేర్లు నమోదు చేసుకొని పనులకు వెళ్లడం లేదు. కొన్ని సంఘాలను తొలగించి, వాటి స్థానంలో శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. జిల్లాలో 8 వేల 680 శ్రమ శక్తి సంఘాలే కాకుండా వికలాంగుల శ్రమశక్తి సంఘాలు 242 వరకు ఉన్నాయి.

క్షేత్రస్థాయి స్థాయిలో మేట్లు..


ఉపాధి కూలీలకు పూర్తిస్థాయిలో పనులు కల్పించడం, రోజూ వారీగా కూలీలు చేసిన పనులను ఎప్పటికప్పుడు నమోదు చేయడం, పనులను లె క్కించేందుకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని ని యమించేదిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్ర భుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సంఘాల్లో మార్పులు చేయడంతోపాటు కూలీలకు అందుబాటులో ఉండేవిధంగా క్షేత్రస్థాయిలో మేట్లను ఏర్పా టు చేయనున్నారు. కూలీల్లో ఎక్కువగా మహిళలే ఉండడంతో క్షేత్రస్థాయిలో మేట్లుగా మహిళలే నియమించనున్నారు. పల్లెల్లో పనిచేసే కూలీలు ఏ సామాజిక వర్గానికి చెందిన వారైతే.. ఆ గ్రామంలో ఆయా సామాజికవర్గాలకు చెందిన కూలీలనే మేట్లుగా, ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించే అవకాశాలున్నాయి.

గుర్తింపునకు ప్రణాళికలు


గతేడాది జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు సరిపడే విధంగా 60 లక్షల 32 వేల 929 పని దినాలను కూలీల కు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు. విధించి దీనికి అనుగుణంగా పనులు చేపట్టారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో గతేడాది కంటే ఎక్కువగా పనులు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయా మండలాల్లో 43 లక్షల 65 వేల 448 పని దినాలను గు ర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మరికొన్ని పం చాయతీల్లో పనిదినాల గుర్తింపుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది కూ లీలతో పనులను గుర్తిస్తున్నారు. గతేడాదికంటే ఈ ఏడాది లేబర్ బడ్జెట్ ఎక్కువగానే రూపొందిస్తామని అధికారులు తెలిపారు. ప్రతి కూ లీకి గరిష్టంగా 197 గిట్టుబాటు అయ్యేలా చర్య లు తీసుకుంటున్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles