డబుల్‌కు పచ్చజెండా


Tue,January 23, 2018 01:54 AM

నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పూర్వ ఆదిలాబాద్ జిల్లా కు సరిహద్దుగా మహారాష్ట్ర రాష్ట్రం ఉంది. ఈ రెండు రాష్ర్టాల మధ్య నదు లు, దట్టమైన అటవీ ప్రాంతాలున్నా యి. మహారాష్ట్ర-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు మధ్య పెనుగంగ, ప్రా ణహిత నదులు, మంచిర్యాల జిల్లాకు మహారాష్ట్రకు మధ్య ప్రాణహిత నది ఉంది. ఇరు ప్రాంతాల మధ్యరాకపోకల కోసం ఇప్పటికే పలుచోట్ల వంతెనలు మంజూరు చేశారు. వీటిపై పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి సరిహద్దులోని మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు అవసరమైన రహదారులు, వంతెనల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే సిర్పూర్ (టి) నియోజకవర్గంలో రెండు వంతెనలు నిర్మించగా, చెన్నూ ర్ నియోజకవర్గంలో ఒకటి నిర్మించారు. సిర్పూర్ (టి) నియోజకవర్గంలోని వెంకట్రావ్‌పేట, బల్హార్షా మధ్య వంతెన పూర్తయి రాకపోకలు సాగుతున్నాయి. చింతలమానేపల్లి మండ లం గూడెం, మహారాష్ట్రలోని అయిరి మధ్య వంతెన నిర్మాణం 70 శాతం పూర్తయింది. జూన్ నాటికి ఈ వంతె న నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నారు.

కోటపల్లి మండ లం అర్జున్‌గుట్ట వద్ద నిర్మిస్తున్న వం తెన పనులు 40 శాతం పూర్తయ్యా యి. సిర్పూర్ (టి), బెల్లంపల్లి, చె న్నూర్ నియోజకవర్గాల నుంచి మ హారాష్ట్రకు వెళ్లేందుకు, రెండు జిల్లాలలోని ఆయా మండలాల్లో ప్రజల ర వాణా అవసరమయ్యే రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ప్రాంతాలు పూర్తిగా అటవీ, మా రుమూల గ్రామాలు. వీటికి తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకంలో భాగంగా కేంద్ర నిధులు మం జూరు చేయించారు.

మూడు నియోజకవర్గాల్లో ఏడు రహదారులు..
ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఏడు రహదారుల నిర్మాణానికి 173.22 కోట్లు మంజూరు చేశారు. సుమారు 146.5 కి.మీ మేర రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అటవీ ప్రాంతాల్లో ఒక వరుస రహదారులు నిర్మించేందుకు మాత్రమే అనుమతు లు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సవరించేలా కృషి చేసింది. అటవీ ప్రాంతాల్లో రెండు వరుసల రహదారుల నిర్మాణానికి అనుమతి పొందిం ది. సిర్పూర్ (టి) నియోజకవర్గంలో ని సిర్పూర్(టి), మేతిన్‌ధని వయా చీలపల్లి, లింగుగూడ, రావన్‌పల్లి, మే డిపెల్లి, చిన్నమాలినీ మీదుగా 18 కి.మీ. రహదారికి 20.42కోట్లు మంజూరయ్యాయి. బెజ్జూర్ మండ లం పాపన్నపేట్ నుంచి మురళీగడ్డ వరకు వయా జెండెపల్లి, కమ్మర్‌గావ్ మీదుగా 20 కి.మీ. 32.61కోటు,్ల దహెగాం మండలం చిన్నరాస్‌పల్లి నుంచి బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి వరకు వయా నగర, లింగాల, ఈతపల్లి మీదుగా 20 కి. మీ.కు 20.95కోట్లు మంజూరు చేశారు.

కాగజ్‌నగర్ మండలం గుం డాయిపేట్ నుంచి కోసిని వరకు జాన్‌గావ్, ఓల్‌గావ్, బూరుపల్లి 19.65 కి.మీ.కు 27.24కోట్లు, బెజ్జూర్ మండలం సోమిని నుంచి కమాన్‌గావ్ వరకు వయా తలాయి, ముర్లగూడ వరకు 13కి.మీ.లకు 19.15 కోట్లు మంజూరయ్యాయి. కమాన్‌గావ్ నుంచి వేమనపల్లి వరకు వయా మోట్లగడ్డ, రావల్‌పల్లి, కల్లన్‌పల్లి, సుంపుటం వరకు 24 కి.మీ.లకు 23.79కోట్లు, వేమనపల్లి మండ లం రాచర్ల నుంచి కోటపల్లి మండ లం అర్జున్‌గుట్ట వరకు వయా వేమనపల్లి, అల్గావ్, రొయ్యలపల్లి, సిర్స, అ న్నారం మీదుగా 32 కి.మీ.కు 29.06 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో రెండు వరుసల రహదారులను నిర్మించనున్నారు. అటవీ ప్రాంతాల్లో సాధారణంగా ఒక వరుస రహదారుల నిర్మాణానికి కేంద్రం అ నుమతి ఇస్తుంది. తాజాగా రాష్ట్ర ప్ర భుత్వ ప్రత్యేక చొరవతో రెండు వరుసల రహదారుల నిర్మాణానికి కేంద్రం నిబంధనలు సవరించి అనుమతించడంతో మారుమూల అటవీ, తీవ్రవా ద ప్రభావిత ప్రాంతాల్లో రహదారు లు మరింత మెరుగుపడనున్నాయి.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...