పకడ్బందీగా జంతుగణన

Tue,January 23, 2018 01:52 AM

పెంచికల్‌పేట్: జంతు గణనను పగడ్బందీగా నిర్వహి స్తామని జిల్లా అటవీశాఖ అధికారి లక్ష్మణ్ రంజిత్ నా య క్ అన్నారు. మండల రేంజ్ పరిధిలో ఎల్లూర్ బీట్‌లోని 237,238 కంపార్టుమెంట్ ప్రాంతంలో సోమవారం స ర్వేను ప్రారంభించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో న డుచుకుంటూ వెళ్తు సర్వేను పరిశీలించారు. ఈ సర్వేలో పె ద్దపులి మలాన్ని గుర్తించా రు. ఈ సంద ర్భంగా ఆ యన మాట్లాడుతూ ఈ అటవీ ప్రాంతంలో పులులు సంచరి స్తున్నాయన్నారు. జిల్లాలోని 243 బీట్లలో సర్వే కొనసా గు తున్నదనీ, ఒక్కో బీట్‌కు ఒక టీం లీడర్‌ని నియమించినట్లు తెలిపారు. మొదటి మూడు రోజులు మాంసాహార జంతు వులను లెక్కిస్తామనీ, మిగితా మూడు రోజులకు శాఖా హార జంతువులను గుర్తిస్తామని చెప్పారు. ఈ నెల 30న అంత ర్జాలంలో సర్వే వివరాలను పొందపరుస్తామన్నా రు. వీరి వెంట చైల్డ్‌లైఫ్ రేంజ్ అధికారి వేణుగోపాల్, ఫారెస్టు సెక్షన్ అధికారి ప్రభాకర్, ఫారెస్ట్ సిబ్బంది వాజీద్, లచ్చ య్య, తదితరులున్నారు.

జైనూర్: జంతువుల లెక్కింపు కోస మే సర్వే నిర్వహిస్తున్నట్లు ఫారెస్ట్ సెక్షన్ అధికారి ప్రియాంక చవాన్ అన్నారు. మండలం లోని లోద్దిగూడా, గౌరి, లేండిగూడ, భూసిమెట్ట, క్యాంపు గ్రామాల శివా రుల్లో ఆటవీ ప్రాంతంలో జంతువుల గణన సోమవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రభుత్వం జంతువుల గణన కోసం 22 నుంచి ఈ నెల 29 వరకు సర్వేలు నిర్వహిస్తున్నదని చెప్పారు. ఎఫ్‌ఎస్‌వో గులాబ్, ఎఫ్‌బీవో ప్రేంసింగ్, వలింటర్లు తబారక్, సల్మాన్ ఉన్నారు.

చింతలమానేపల్లి: జంతు గణన పకడ్బందీగా చేపట్టాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి రాజేందర్ అన్నారు. మండలంలోని కర్జెల్లి రేంజ్ పరిధిలో జంతు గణన సర్వే సోమవారం ప్రారంభించారు. ఎఫ్‌ఎస్‌ఓలు ముసవీర్, గోపీచంద్, సోమాజీ, రామకృష్ణ, ఎఫ్‌బీఓలు ప్రభాకర్, శ్రీధర్, అనిత, జామ, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

జన్నారం/ నెన్నెల/ వేమనపల్లి: మండలంలోని ఇస్లాంపూ ర్ అడవుల్లో చిరుత పులి పాదముద్రలను, మలాన్ని బీట్ అధికారి అనిల్ గు ర్తించారు. తాళ్లపేట అడవుల్లో బీట్ అధికారి శ్రీనివాస్, ఎ ఫ్‌ఎస్‌వో మమత ఆధ్వర్యం లో నిర్వహించారు. నెన్నెల మండలంలోని కుశ్నపల్లి రేంజ్‌లో ఎఫ్‌ఆర్వో అప్పల కొండా ఆధ్వర్యంలో పులితో పాటు పలు జంతువుల అడు గుల నమూనాలను సేకరించా రు. డిప్యూటీ రేంజ్ అధికారి ర మాదేవి, సె క్షన్ అధికారి బాబు పటేకర్, బీట్ అధికారులు రమేశ్, కామ రాజు పాల్గొన్నారు. చెన్నూరు డివిజనల్ అధికారి రాజారావు, నీ ల్వాయి రేంజర్ అరవింద్ ఆధ్వర్యంలో గణన ప్రారం భిం చారు. కోటపల్లి పరిధిలో రేంజర్ రవి ఆధ్వర్యంలో కోటప ల్లి, బొప్పారం, అన్నారం, నాగంపేట, ఎసన్వాయి, సర్వాయిపేట అటవీ ప్రాంతంలో గణన నిర్వహించారు.

106
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles