ఉమ్మడి జిల్లా నుంచి జాతరకు బస్సులు

Tue,January 23, 2018 01:52 AM

నిర్మల్ కల్చరల్: మేడారం సమ్మ క్క సారాలమ్మ జాతరకు ఉమ్మడి జిల్లా నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. జిల్లా కేం ద్రంలోని నిర్మల్ బస్‌డిపోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా నుంచి అసిఫాబాద్, బెల్లంపెల్లి, మంచిర్యా ల, మందమర్రి, చెన్నూర్, శ్రీరాం పూర్ ప్రాంతం నుంచి 304 బస్సులను నడిపించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతే కాకుం డా ప్రయాణికుల సౌకర్యార్థం తాగునీరు, తదితర వసతులను బస్టాండ్ లో ఏర్పాటు చేస్తామన్నారు. ఆసిఫాబాద్ నుంచి పెద్దలకు 360 పిల్లల కు 190, బెల్లంపెల్లి నుంచి 310, పిల్లలకు 160, మందమర్రి నుంచి 300, 160, మంచిర్యాల్ నుంచి 280, 150 చెన్నూర్ నుంచి 310, 160, శ్రీరాంపూర్ నుంచి 260, 140 టికెట్ ధర నిర్ణ యించినట్లు తెలిపారు. డివిజన్ మేనేజర్ రమేష్, మాధవరెడ్డి, గడ్డం సతీష్‌చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles