కంది కొనుగోళ్లకు రెడీ..

Sun,January 21, 2018 11:51 PM

-జిల్లాలో నేటి నుంచి ప్రారంభం
-ఆసిఫాబాద్, జైనూర్, కాగజ్‌నగర్‌లో కేంద్రాలు
-అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంతో పాటు జైనూర్, కాగజ్‌నగర్‌లలో మార్కెట్ యార్డులు ఉన్నాయి. మంగళవా రం నుంచి ఆసిఫాబాద్, జైనూర్ మార్కెట్ యా ర్డు ల్లో కందుల కొనుగోళ్లను అధికారులు ప్రారంభించనున్నారు. మార్కెఫెడ్, హాకా సంస్థల ద్వారా కొ నుగోళ్లు చేపడుతుండగా ప్రభుత్వం క్వింటాలుకు రూ. 5450 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. జిల్లాలో కొంది కొనుగోళ్లు ఈ నెల 15 నుంచి ప్రా రంభం కావాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వాయిదా పడింది. కందుల కొనుగోళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అధికారులు కల్పించారు.

గతేడాదికంటే తగ్గిన సాగు..


జిల్లాలో కంది సాగు గతేడాదితో పోలిస్తే బాగా తగ్గిపోయినట్లు తెలుస్తున్నది. గతేడాది జిల్లాలో 69 వేల 693 ఎకరాల్లో సాగు చేయగా, దాదాపు 2 లక్షల 78 వేల క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఈ ఏ డాది అందులో సగానికంటే తక్కువగా సాగు చేశా రు. జిల్లా వ్యాప్తంగా కేవలం 25 వేల 978 ఎకరా ల్లో మాత్రమే పంట వేశారు. వర్షాలు సరిగా లేక ది గుబడి కూడా తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షా 20 వేల క్వింటాళ్ల నుంచి లక్షా 50 వేల క్వింటాళ్ల దిగుబడి ఉంటుందని భావిస్తున్నారు.

గతేడాదికంటే రూ. 400 పెరిగిన ధర..


గతేడాది మార్కెట్ యార్డుల్లో మార్కెట్ ఫెడ్ ద్వారా చేపట్టిన కొనుగోళ్లు చేపట్టగా ప్రభుత్వం క్వింటాలుకు రూ. 5050 మద్దతు ధర ప్రకటించిం ది. ఈ ఏడాది క్వింటాలుకు రూ. 5450 చొప్పున కొనుగోలు చేయనున్నది. గతేడాది ప్రైవేటు వ్యాపారులు రూ. 3800 నుంచి రూ. 4 వేల వరకు చెల్లించడంతో, రైతులందరూ మార్కెట్ యార్డుల్లోనే ప్ర భుత్వం నిర్ణయించిన ధరకు కందులను విక్రయించారు. గతేడాది సంచుల కొరత, ఇతర కారణాల తో అధికారులు సకాలంలో కందులను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది అలాంటివి తలెత్తకుండా అన్ని జాగ్రత్త లు తీసుకున్నామని అధికారులు తెలిపారు. రైతు లు మార్కెట్ యార్డుల్లోనే కందులు విక్రయించాల ని కోరుతున్నారు. మార్కెట్ యార్డుల్లో కందులను ఆరబెట్టుకునేందుకు విశాలమైన స్థలంతోపాటు, మౌలిక వసతులు కల్పించారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు.

నేటి నుంచి కొనుగోళ్లు చేపడుతాం


జిల్లాలో కందుల కొ నుగోళ్లు ఈ నెల 22 నుంచి ప్రారంభిస్తాం. జి ల్లాలో మూడు మార్కెట్ యార్డులు ఉన్నాయి. ముందుగా ఆసిఫాబాద్, జైనూర్ మార్కెట్ యార్డులో కందుల కొనుగోళ్లు చేపడుతాం. రైతులు వ్యాపారులను ఆశ్రయించకుండా మార్కెట్ యార్డుల్లోనే అమ్ముకోవాలి. పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కందులను కొనుగోలు చేసేందుకు అ న్ని ఏర్పాట్లు చేశాం.
- వెంకటేశ్వర్లు, జిల్లా మార్కెటింగ్ అధికారి

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles