ఇగ లెక్కింపు!నేటి నుంచి జంతుగణన

Sun,January 21, 2018 11:49 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోనే నేటి నుంచి జంతుగణన ప్రారంభం కానున్నది. 4878 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2420.17 చదరపు కిలోమీటర్లు అంటే సుమారు 49.61 శా తం అడువులే విస్తరించి ఉన్నాయి. నాలుగేళ్లకోసారి నిర్వహించే జంతుగణన 2014లో జరిగింది. ఈ గణనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో శాఖాహార, మంసాహార జంతువుల వివరాలను సేకరించిన అధికారులు ఈసారి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడవుల్లో జంతువుల లెక్కలు తేల్చనున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్‌లలో కలిపి 243 అటవీ బీట్లు ఉండగా, సుమా రు 170 మంది సిబ్బంది జంతుగణనలో పాల్గొనున్నారు. ఇందులో అటవీ సిబ్బంది 70 మంది వరకు ఉండగా, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా 25 మం ది వలంటీర్లు, కొంత మంది డిగ్రీ విద్యార్థులు పాల్గొనున్నారు. 22,23,24 తేదీల్లో మాంసహార జంతువులు, ఆ తర్వాత మూడురోజుల పాటు శాఖాహార జంతువులను లెక్కించన్నునారు.

నేటి నుంచి గణన..
నాలుగేళ్లకోసారి చేపట్టే జంతుగణనను జిల్లాలో ఈ నెల 22 నుంచి ప్రారంభించనున్నారు. 2014 లో ఉమ్మడి జిల్లా వారీగా చేపట్టిన జంతుగణన ఈ సారి ఏ జిల్లాకాజిల్లాలో చేపట్టనున్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గతంలో చేపట్టిన సర్వేల్లో కాగజ్‌నగర్‌లో ఆరు, కవ్వాల్‌లో రెండు పులులు ఉన్నట్లు గుర్తించారు. పులుల సంరక్షణకు కావాల్సిన చర్యలు సరిగా తీసుకోకపోవడం తో కొంతకాలంగా పులులు కనిపించడం లేదనీ, ఇత ర ప్రాంతాలకు వెళ్లిపోయాయనే ఆరోపణలు ఉన్నా యి. పులుల సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతు న్న చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతాల్లో శాఖాహార జంతువులను పెంచడంపై దృష్టి పెట్టారు. దీంతో ఇటీవలి కాలంలో తడోబా నుంచి కాగజ్‌నగర్ వైపు పు లుల రాక ప్రారంభమైనట్లు తెలుస్తున్నది. గతేడాది నుంచి తడోబా మీదుగా పులులు వస్తున్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. జంతు గణనలో ఎన్ని పులులు ఉన్నాయో స్పష్టం కానున్నది. సీసీ కెమెరాలు అడవుల్లో ఏర్పాటు చేయడం, పులుల సంచారం, వాటి అడుగులు(పగ్‌మార్క్)లను బట్టి సంఖ్యను అంచ నా వేయనున్నారు. జిల్లాలో మాంసాహార జంగుతువులు, శాకాహార జంతువులు ఎన్ని ఉన్నాయనే విష యం తెలిపోనున్నది.

ఆరు రోజుల పాటు
జిల్లాలోని అడవుల్లో జంతువులను లెక్కించేందు కు అటవీ సిబ్బందితో పాటు వలంటీర్లు, విద్యార్థులు కూడా అడవుల బాటపట్టనున్నారు. ఈ నెల 22, 23,24 తేదీల్లో మాంసాహార జంతువుల గణన చేపడుతారు. దీనికి సంబంధించి ఈనెల 25,26 తేదీల్లో వారు సేకరించిన సమాచారాన్ని ధ్రువీకరిస్తారు. దీనికి సంబంధించి అధికారులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆసిఫాబాద్ డివిజన్‌లోని 154 బీ ట్లు, కాగజ్‌నగర్‌లోని 89 బీట్లలో సర్వే చేపట్టనున్నా రు. ఒక్కో బీట్‌ను యూనిట్‌గా తీసుకొని బీట్ అధికారి సర్వే చేస్తారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు కాహార జంతువుల గణన చేపడుతారు. వాటితో పా టు అడవుల్లోని చెట్ల రకాలు, పక్షుల వివరాలు సేకరిస్తారు. ఏ అటవీ ప్రాంతంలో ఏఏ రకాల జంతువులు ఎన్ని ఉన్నాయి.. ఏయే రకాలైన వృక్షాలు ఉ న్నాయనే విషయాలను పూర్తిస్థాయిలో సేకరిస్తారు. సమాచారం అంతా క్రోడీకరించి ఉన్నతాధికారులకు అందజేస్తారు. సర్వేలు చేపట్టే అధికారులకు ప్రత్యేక కిట్లను అందించారు. ఒక్కో కిట్‌లో టేపు, 20 మీ టర్ల తాడు, వాటర్ బాటిల్, రెండు కిలోల ప్లాస్టర్ ఆ ఫ్ పారీస్, సెలికాన్ జెల్, పగ్ మార్క్‌లను కొలిచేందుకు ట్రాన్సింగ్ పేపర్ తదితర వస్తువులు ఉం టాయి. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు జంతుగణన కొనసాగుతుంది.

ఆధునిక పరిజ్ఞానం వినియోగం..
అడవుల్లో పులుల గణనకు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు తెలుస్తున్నది. మానిటరింగ్ సిస్టం ఫర్ టైగర్స్ - ఇంటెన్సివ్ పాట్రోలింగ్ అండ్ ఎకోలాజికల్ స్టాటస్ అనే సాఫ్ట్‌వేర్‌ను అటవీ అధికారులు వినియోగించే అవకాశం ఉంది. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ రూ పొందించిన ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పులుల సం ఖ్య కచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. అడవు ల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలతో పాటు పులుల విసర్జితాలు, కాలి అడగులు, వాటి వెంట్రుకలు తదితరాల ఆధారంగా ఈ సర్వే కొనసాగుతుంది.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles