కలిసి కట్టుగా పనిచేయాలి

Sun,January 21, 2018 11:48 PM

దహెగాం: టీఆర్‌ఎస్ పటిష్టానికి కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని చిన్నరాస్పల్లి గ్రామంలో కార్య కర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నద న్నారు. వ్యవసాయానికి 24గంటల విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందిపడుతున్నారనే ఉద్ధేశంతో భూ రికార్డుల ప్రక్షాళన సర్వే చేపట్టారన్నారు. ప్రతిపక్ష పార్టీలకు కౌటాల ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పా రన్నారు. పిపిరావు ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ. 27కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. పెంచికల్‌పేట్ పెద్దవాగు, గిరవెల్లి ఎర్రవాగు వంతెనను త్వరలో నే పూర్తిచేయించి రవాణా సౌకర్యం మెరుగుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దహెగాం, కౌటాల జడ్పీటీసీలు లావుడె సుజాత, డుబ్బుల నానయ్య, డీసీసీబీ డైరెక్టర్ తాళ్లపల్లి శ్రీరామా రావు, ఆత్మ చైర్మన్ కొము రాగౌడ్, కౌటాల ఎంపీపీ డుబ్బుల వెంకన్న, మార్కెట్ కమిటీ ఉపా ధ్యక్షులు సంతోష్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఘనపురం శ్రీనివాస్, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ముప్పాల మురళీధర్‌రావు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles