కష్టపడి చదివి లక్ష్యం చేరుకోండి


Sun,January 21, 2018 11:48 PM

కాగజ్‌నగర్, నమస్తే తెలంగాణ: ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి లక్ష్యం చేరుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. పట్టణంలోని ఎస్పీఎం హెచ్‌ఆర్డీ భవన్‌లో రెండు నెలలుగా టీఆర్టీ అభ్యర్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతు లు ఆదివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ జి ల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి అభ్యర్థులు ఈ తర గతులకు హాజరవడం సంతోషంగా ఉందన్నారు. పేదిం టి యువతకు అండగా ఉండేందుకు ఈ తరగతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులకు నిపు ణులైన సిబ్బందితో శిక్షణ ఇప్పించామన్నారు. ఉపయోగ పడేలా స్టడీ మెటీరియల్‌ను అందజేశామని చెప్పారు. అభ్యర్థులు కష్టపడి చదివి, ఉద్యోగం సాధించినప్పుడే, తమ ప్ర యత్నానికి ప్రతిఫలం ఉంటుందన్నారు. సీఎం చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారనీ, ఇందులో సిర్పూర్ నియోజవర్గాన్ని ముం దు నిలిపేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు చె ప్పారు. బెజ్జూరు మండలానికి చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థులను గ్రూప్-1 పరీక్ష కోసం ఢిల్లీలో శిక్షణ కోసం పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పలువు రు అభ్యర్థులు మాట్లాడుతూ శిక్షణ కోసం కోచింగ్ సెం టర్లకు వెళ్లకుండా ఇక్కడే మంచి తరగతులకు హాజరైన అనుభవం కలిగిందన్నారు. ఈ తరగతులు ఏర్పా టు చేసిన ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు రుణ పడి ఉంటామ న్నారు. అనంతరం మోడల్ పరీక్షా పత్రాలను ఎమ్మెల్యే, ఉపాధ్యాయ సంఘాల నాయకులు విడుదల చేశారు. క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ దామోదర్‌రావు, మురళీ, ఉపాధ్యాయ సంఘం నాయకులు రాజకమలాకర్‌రెడ్డి, శ్రీనివాస్, తిరుపతయ్య, రమేశ్, సత్యనారాయణ, కల్వల శంకర్, లింగారెడ్డి, శాంతికుమారి, పుప్పాల గణేశ్, పూర్ణచందర్‌రావు, కొమురాగౌడ్, విజయ్‌యాదవ్, తిరుపతి, తదితరులున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...