సాయి ఆలయం ముస్తాబు


Sun,January 21, 2018 11:47 PM

ఆసిఫాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలో ని షిరిడీ సాయి మందిరం వార్షికోత్సవానికి ముస్తాబైంది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంలా, అభినవ షి రిడీ క్షేత్రంగా వెలుగొందుతున్న సాయి మందిరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సాయి మందిరంలో బాబా మూల విరాట్టుతోపాటు గణపతి, దత్తాత్రేయ స్వామి, నందీశ్వర విగ్రహాలు కొ లువై ఉన్నాయి. ఈ ఆలయం నిర్మాణానికి 1997 నవంబర్ 24న పరమహం స పులాజీ బాబా శంకుస్థాపన చేయగా ఫిబ్రవరి 10, 2000న పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా నృసింహ భారతి చేతు ల మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిం ది. భక్తుల సహకారంతో ఆలయ ప్రాం గణంలో కల్యాణ మండపం, అన్నదా న మండపాలను నిర్మించారు.

పద్దెనిమిదేళ్లుగా ఈ సాయి క్షేత్రంలో ప్రతిరోజు రాత్రి విష్ణు సహస్రనామ పా రాయణం, లక్ష్మీ అష్టోత్తర నామావళి, రుద్రాష్టకం, శ్రీరామ రక్షాస్తోత్రం, చం ద్రశేఖరాష్టకం, శ్రీమద్భవద్గీత పారాయణం నిరాటంకంగా సాగుతోంది. ఏటా గురుపౌర్ణమి, దసరా, దత్త పౌర్ణ మి, కోజాగర పౌర్ణమి, కృష్ణాష్టమి, శంకర్‌జయంతి, గీతాజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతోపాటు ప్రతి నెలాఖరు గురువారం ఆలయంలో అన్నదానం చేస్తారు. వసంత పంచమిని పురస్కరించుకొని ఆలయం లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడంతోపాటు సాయంత్ర పల్లకీ సేవ, రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సోమవారం వసంత పంచమిని పురస్కరించుకొని ఆలయ 18వ వార్షికోత్సవ నిర్వహణ కోసం ఆలయా న్ని విద్యుత్ దీపాలతో అలంకరించా రు. ఈ సందర్భంగా సోమవారం ఉద యం కాకడ హారతి, స్వామి వారికి మంగళస్నానం, ధూప హారతి, మహా మంత్ర పుష్పం, చతుర్వేద సేవలు, గ ణపతి పూజ, పుణ్యాహవాచనం, అ ఖండ దీపారాధన, పంచగవ్యప్రాశన, నవగ్రహవాస్తయోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్ర, మండల స్థాపన పూజ, హోమ, మధ్యాహ్నం 12 గంటలకు మంగళహారతి, అనంతరం తీర్థప్రసా ద వితరణ, అన్నదానం, సాయంత్రం పల్లకీ సేవ, రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలే కాకుండా మండలంలోని ఆయా గ్రామాలు, చుట్టు పక్కల మండలాలు, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు హాజరై, సాయినాథుడికి పూజలు చేస్తారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...