భూమి పట్టా చేయాలని ధర్నా


Sun,January 21, 2018 11:47 PM

బెజ్జూర్: పాలిభాగం కింద తనకు ఇచ్చిన భూమి ని వెంటనే పట్టా చేయాలని కోరుతూ మండలంలోని రెబ్బెన గ్రామానికి చెందిన రైతు పాల్వాయి రాములు ఆదివారం మండల కేంద్రంలో ధర్నాకు దిగాడు. ఈ సందర్భంగా ఆయనకు టీఆర్‌ఎస్ నా యకులు మద్దతు పలికారు. రెబ్బెన శివారులో పా లిభాగం కింద ఇచ్చిన 7 ఎకరాల భూమిని వారసులైన పాల్వాయి హరీశ్‌బాబు, సుధాకర్‌రావు, వసంత్‌రావ్, అశోక్‌రావ్, వేణు రావ్, కిషన్‌రావ్, పట్టా చేసుకున్నారని బాధిత రైతు ఆరోపించారు. తనకు అధికారులే న్యాయం చేయాల ని కోరాడు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అర్షద్ హుస్సేన్ మాట్లాడుతూ బా ధితుడికి పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామన్నారు. అనంతరం పోలీసుల జోక్యంతో ధర్నా విరమించారు. ఎంపీటీసీలు నాయిని భాగ్య, ఏటకారి భీ మేశ్, టీఆర్‌ఎస్ నాయకులు సిడాం సకరాం, డు బ్బుల శంకరయ్య, బషారత్‌ఖాన్, నైతం సత్తయ్య, తొర్రెం బాణయ్య, ఇంజిరి రాజారాం, వడ్డెపల్లి శ్రీనివాస్, జాహిద్ హుస్సేన్, పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...