కంది రైతుకు తొలగనున్న రంది!

Sun,January 21, 2018 02:35 AM

-50 శాతం వరకు కొనుగోళ్లు చేపట్టాలని కేంద్రానికి వినతి
-సానుకూలంగా కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్
-రాష్ట్ర సర్కారు విన్నపంపై రైతుల హర్షం
ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ : పప్పు దినుసులను అధిక మొత్తంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరడం పై జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు పంటలో కేవలం 25 శాతం మాత్రమే కేం ద్ర ప్రభుత్వం కొనుగోలు చేయగా, మిగితావి కొన డం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారింది. కందు లు, మినుములు రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారనీ, దీంతో కనీసం 50 శాతం పంటనైన తీసుకోవాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో 31,237 ఎకరాల్లో కంది సాగు చేశారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం సంస్థలైన హాకా, మార్కెఫెడ్, సీసీఐలు కొనుగోలు చేస్తున్నాయి.

జిల్లాలో మూడు కేంద్రాలు..
కేంద్రం ప్రకటించిన మద్ధతు ధర క్వింటాలుకు రూ. 5450 లకు రాష్ట్ర ప్రభుత్వం కందులను కొనుగోలు చేస్తున్నది. జిల్లాలో ఈ సారి సుమారు 12 లక్షల క్వింటాళ్ల కందుల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే పలువురు ఎంపీలతో పాటు ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కలిశారు. ప్రస్తుతమున్న కేంద్రం కొనుగోలు చేస్తున్న 25 శాతాన్ని 50 శాతానికి పెంచాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో జిల్లాలోని మూడు కొనుగోలు కేంద్రాలైన ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, జైనూర్ కేంద్రాల ద్వారా దాదాపుగా 15 వేల క్వింటాళ్లకు పైగా ప్రభుత్వ రంగ సంస్థలు కందులను కొనుగోలు చేయనున్నాయి.

గడువు పెంచాలని విజ్ఞప్తి
కందుల కొనుగోళ్ల గడువు పొడిగించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డిసెంబర్ 1 నుంచి నోడల్ ఏజెన్సీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ జిల్లాలో కంది జనవరి నుంచి మార్చి చివరి వరకు మార్కెట్‌కు రానున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గడువు పొడించాలని కోరింది.
రైతులకు మద్ధతు ధర..
గత పాలకుల హయాంలో కందుల కొనుగోళ్లు లేవు. కేవలం తెలంగాణ ఏర్పాటు తర్వాతే ప్రభుత్వం ప్ర త్యేకంగా చర్యలు తీసుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. క్వింటాలు కందులు రూ. 5450 కొనుగోలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి..
కందులను దళారులకు విక్రయించకుండా ప్రభు త్వ కొ నుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్ధతు ధర పొం దాలి. నాణ్యమైన కందుల ను తీసుకువచ్చి రూ. 54 50ను పొందాలి. అ నుమతులు లేకుండా ఎక్కడైన కొనుగోలు చేస్తే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం.
-వెంకటేశ్వర్లు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి,ఆసిఫాబాద్

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles