రేపటి నుంచి అటవీశాఖ సర్వే


Sun,January 21, 2018 02:35 AM

జైనూర్: ఈ నెల 22 నుంచి అటవీ శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి, జంతు గణనను ప్రారంభించనున్నట్లు అటవీ రేంజి అధికారి ఎండీ మజర్ తెలిపారు. అందులో భాగంగా శనివారం మండల అటవీ శాఖ అధికారులు, వలంటీర్లతో కలిసి పలు అటవీ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ అడవిలో ఉన్న వన్యప్రాణుల కోసం ఈ సర్వేలు చేపడుతున్న ట్లు తెలిపారు. పులులు, ఇతర జంతువులను గుర్తిస్తున్నట్లు చెప్పారు. మండలంలోని చిత్తకర్ర గ్రామ పరిసర ప్రాంత అడవిలో పర్యటించిన మండల అటవీ శాఖ అధికారులు, వలంటీర్లకు జంతు గణన పై అవగాహన కల్పించారు. ఈ నెల 22 నుంచి 29వరకు ఈ సర్వే జరుగనున్న ట్లు తెలిపారు. ఈ సందర్భంలో ఆయన వెంట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చవాన్ ప్రియాంక, బీట్ అధికారి మాయ, వలంటీర్లు తబారక్, సయ్యద్ షకీల్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...