ఘనంగా మార్కండేయ జయంతి


Sun,January 21, 2018 02:34 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలో శనివారం మార్కండేయ జ యంతిని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా మార్కండేయ ఆలయం వద్ద పద్మశాలీలు పల్లకీ సేవ నిర్వహించి, ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం పల్లకీ సేవతో పాటు భజనలు చేస్తూ నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం పెద్దవాగు ఒడ్డు, బజార్‌వాడీ మార్కండేయ ఆలయాల వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి అశోక్, నాయకులు బండి శ్రీనివాస్, కోమటిపల్లి లింగయ్య, అనుమాండ్ల శ్రీకాంత్, జంజిరాల శ్రీనివాస్, వావిలాల నాగయ్య, రాపల్లి విజ య, జంజిరాల సరస్వతి, జంజిరాల పు ష్పలత, లక్ష్మీనారాయణ, సంజీవ్ పద్మశా లి మహిళలు, పురుషులు పాల్గొన్నారు.
రెబ్బెన: మండలంలోని గోలేటి గ్రామం లో శనివారం రోజున పద్మశాలీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మార్కండేయ జ యంతి వేడుకలు ఘనంగా నిర్వహించా రు. గోలేటికి చెందిన జోర్రిగల సత్యనారాయణ-చంద్రకళ, మాంత సమ్మయ్య-మంగ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మెరుగు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమార్, కోశాధికారి బొగ్గిల్ల శ్రీనివాస్, సీ నియర్ నాయకులు గుండేటి వీరస్వామి, పొన్న శంకర్, మండలాధ్యక్షుడు మారిన వెంకటేశ్వర్లు, నాయకులు బోగే ఉపేంద ర్, వెంకటనారాయణ, పరికిపండ్ల మొగి లితో పాటు పలువురు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...